DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
DK Shivakumar | నా వద్ద డబ్బులు లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ఇది ఎవరో కాదు అన్నది కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar). ఆ టికెట్ తీసుకున్నది మరెవరో కాదు సాక్షాత్తు ప్రధాని మోదీ (PM Modi).
DK Shivakumar | త్రినేత్ర న్యూస్: నా వద్ద డబ్బులు లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ఇది ఎవరో కాదు అన్నది కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar). ఆ టికెట్ తీసుకున్నది మరెవరో కాదు సాక్షాత్తు ప్రధాని మోదీ (PM Modi). ఈ నెల 13న బెంగళూరు మెట్రో (Bengaluru Metro) పింక్‌లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇరువురు నేతల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికరమైన ఘటన ఇది.
ప్రధాని మోదీ గత శుక్రవారం బెంగళూరు, మైసురులో పర్యటించారు. తొలుత బెంగళూరులో పింక్ లైన్‌ను ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణించారు. రైలు ఎక్కడానికి ముందు ప్రధాని మోదీతోపాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ టికెట్ కౌంటర్ (Metro Ticket) వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా `టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి` అంటూ ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సరదాగా అన్నారు. దీంతో ప్రధాని స్వయంగా తన మెట్రో స్మార్ట్ కార్డుతో ఇద్దరికీ టికెట్ తీసుకున్నారు.
ప్రధాని మోదీతో ఉన్న అనుబంధం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం శివకుమార్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలన్నారు. ఇద్దరూ కలిసి హెలీకాప్టర్‌లో మైసూరు వెళ్లారు కదా.. అప్పుడు ఏం చర్చించుకున్నారని ప్రశ్నించగా.. తాము చర్చించుకున్న ప్రతి విషయాన్ని బయటపెట్టలేను అని చెప్పారు.
బీజేపీ నేతలకు కూడా దొరకని సమయం ప్రధాని మోదీ వద్ద మీకు లభిస్తున్నదని అడగడంతో.. అది మానవ సంబంధాలు (Human Relationships), పరస్పర గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. `మా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా నన్ను ఎంతో ప్రేమ, గౌరవంతో చూసుకుంటారు. అందరికీ నాయకత్వ లక్షణాలు ఉండవు. నేను ఎవరితో మాట్లాడటానికైనా వెనుకాడను. మనం అందరితో మంచి సంబంధాలు కొనసాగించాలి` అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్






