Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
Adventure Motorcycles | అడ్వెంచర్ బైక్‌లను ఇష్టపడే వారికి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పనున్నాయి. భారత మార్కెట్లోకి త్వరలో మూడు సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు రానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హిమాలయన్ 750, హిమాలయన్ ఎలక్ట్రిక్ (హిమ్-ఈ), హీరో మోటోకార్ప్ నుంచి ఎక్స్‌పల్స్ 450 అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
Technology | Published On Nov 15, 2026, 9.30 am IST
Adventure Motorcycles | అడ్వెంచర్ బైక్‌లను ఇష్టపడే వారికి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పనున్నాయి. భారత మార్కెట్లోకి త్వరలో మూడు సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు రానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హిమాలయన్ 750, హిమాలయన్ ఎలక్ట్రిక్ (హిమ్-ఈ), హీరో మోటోకార్ప్ నుంచి ఎక్స్‌పల్స్ 450 అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. శక్తివంతమైన ఇంజిన్లు, అధునాతన ఫీచర్లు, మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థతో ఈ బైక్‌లు రానున్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750
అడ్వెంచర్ బైక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 ఒకటి. ఈ బైక్‌లో 743 సీసీ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది సుమారు 55 పీఎస్ పవర్, 63 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుందని అంచనా. ఫీచర్ల విషయానికొస్తే.. 43 ఎంఎం షోవా యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, ఐదు రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, 4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఇవి సుదూర ప్రయాణాలతో పాటు కఠినమైన రోడ్లపై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. గోవాలో జరగనున్న మోటోవర్స్ 2026లో ధరలను ప్రకటించే అవకాశం ఉంది.
హీరో ఎక్స్‌పల్స్ 450.. 2027లో లాంచ్?
హీరో మోటోకార్ప్ కూడా అడ్వెంచర్ బైక్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎక్స్‌పల్స్ 450పై పనిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌పల్స్ సిరీస్‌కు మరింత శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఈ మోడల్ రానుంది. ఇందులో 421 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ 46.7 బీహెచ్‌పీ పవర్, 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఇందులో ఉండనున్నాయి. సస్పెన్షన్ కోసం అడ్జస్టబుల్ కేవైబీ యూనిట్లను అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ద్వారా నావిగేషన్ సహా కీలక సమాచారాన్ని రైడర్లు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ బైక్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండగా.. ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.80 లక్షల నుంచి రూ.3.10 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
హిమాలయన్ ఎలక్ట్రిక్ (హిమ్-ఈ).. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ..
రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. తన అడ్వెంచర్ బైక్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌గా హిమాలయన్ ఎలక్ట్రిక్‌ను అభివృద్ధి చేస్తోంది. హిమ్-ఈ పేరుతో పిలుస్తున్న ఈ బైక్ ప్రస్తుతం లడఖ్‌లో టెస్టింగ్ దశలో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో సుమారు 14 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. ఇక ఇందులో ఎకో, టూల్, ఆఫ్‌రోడ్, ర్యాలీ సహా నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉండొచ్చని తెలుస్తోంది. మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఓహ్లిన్స్ సస్పెన్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7 లక్షల నుంచి రూ.7.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. లాంచ్ తేదీ, ధర, ఇతర సాంకేతిక వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో మరిన్ని ఆప్షన్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో మోటోకార్ప్ నుంచి రానున్న ఈ మూడు బైక్‌లు భారత అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మార్కెట్లో మరిన్ని ఎంపికలను అందించనున్నాయి. హిమాలయన్ 750 శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్‌తో ఆకట్టుకోనుండగా.. ఎక్స్‌పల్స్ 450 మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్ విభాగంలో పోటీని పెంచే అవకాశం ఉంది. మరోవైపు హిమాలయన్ ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్‌లను కోరుకునే వారికి కొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ప్రస్తుతం ఈ మూడు బైక్‌లకు సంబంధించి వెల్లడైన వివరాలన్నీ అంచనాలు, ప్రాథమిక సమాచారం మాత్రమే. కంపెనీలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే వీటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలపై పూర్తి స్పష్టత రానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్






