త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీక‌ర దాడులు.. 49 మంది మృతి

Myanmar | మయన్మార్ (Myanmar)లోని పశ్చిమ రఖైన్‌ రాష్ట్రంలో (Rakhine region) గల క్యౌక్తావ్‌ టౌన్‌షిప్‌లోని (Kyauktaw township) ఓ రద్దీ మార్కెట్‌పై సైన్యం భీకర దాడుల‌కు పాల్ప‌డింది. ఈ వైమానిక దాడిలో 49 మంది మృతి చెందారు.

D

International | Published On Sep 29, 2026, 11.24 am IST

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీక‌ర దాడులు.. 49 మంది మృతి
Advertisement

Myanmar | త్రినేత్ర న్యూస్ : మయన్మార్ (Myanmar)లోని పశ్చిమ రఖైన్‌ రాష్ట్రంలో (Rakhine region) గల క్యౌక్తావ్‌ టౌన్‌షిప్‌లోని (Kyauktaw township) ఓ రద్దీ మార్కెట్‌పై సైన్యం భీకర దాడుల‌కు పాల్ప‌డింది. ఈ వైమానిక దాడిలో 49 మంది మృతి చెందగా.. సుమారు 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. రఖైన్‌లోని క్యౌక్తావ్‌ ప్రాంతం అరాకాన్‌ ఆర్మీ (Arakan Army) ఆధీనంలో ఉంది. సోమ‌వారం మధ్యాహ్నం సమయంలో ఒక ఫైటర్ జెట్ స్థానిక మార్కెట్ సమీపంలో రెండు బాంబులను జారవిడిచిన‌ట్లు అరాకాన్‌ ఆర్మీ వెల్ల‌డించింది.

మార్కెట్ ప్రాంతం కావ‌డంతో భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు పేర్కొంది. అనేక మంది వ్యాపారులు, కొనుగోలుదారులు, స్థానికులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వెల్ల‌డించింది. గాయ‌ప‌డిన 58 మందిలో 22 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు అరాకాన్ ఆర్మీ తెలిపింది. ఆ ప్రాంతంలో ఈ మార్కెట్ ప్రధాన టోకు కేంద్రమని వెల్ల‌డించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డికి వ‌స్తార‌ని పేర్కొంది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైన్యం ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులకు పాల్పడిందని అరాకాన్ ఆర్మీ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై త్వరలోనే ప్రతీకార చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించింది.

మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభం

మయన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1న ఆంగ్ సాన్ సూకీ (Aung San Suu Kyi) నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ, సాయుధ ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. ఈ క్ర‌మంలోనే సైన్యం, రెబ‌ల్ ఆర్మీ మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగుతోంది. గత డిసెంబరులోనూ రఖైన్‌లోని మ్రౌక్‌-యూ టౌన్‌షిప్‌లో ఉన్న ఓ ఆసుప‌త్రిపై మిల‌ట‌రీ జ‌రిపిన వైమానిక దాడిలో క‌నీసం 34 మంది మ‌ర‌ణించారు. సుమారు 80 మంది గాయ‌ప‌డ్డారు.

Also Read..

కెన‌రా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణ‌లో 134, ఏపీలో 247 ఖాళీలు

షేర్ మార్కెట్‌ల‌లో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

పాల‌పిట్ట‌ను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

Advertisement
Advertisement