త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బ‌ర్ ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు.. డాక్ట‌ర్ ల‌క్ష్మీభాస్క‌ర్ అవినీతి వ్య‌వ‌హారంలో కొత్త లింకులు..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ అడిష‌న‌ల్ సూపరింటెండెంట్‌ డాక్ట‌ర్ ల‌క్ష్మీభాస్క‌ర్ (Dr. Nori Lakshmi Bhaskar) అవినీతి వ్య‌వ‌హ‌రంలో కొత్త లింకులు బ‌య‌ట‌పడ్డాయి. ఈ కేసుకు సంబంధించి డాక్ట‌ర్ లక్ష్మీభాస్కర్ అనుమానిత బినామీల ఇండ్ల‌లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

G

Hyderabad | Published On Sep 29, 2026, 11.28 am IST

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బ‌ర్ ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు.. డాక్ట‌ర్ ల‌క్ష్మీభాస్క‌ర్ అవినీతి వ్య‌వ‌హారంలో కొత్త లింకులు..
Advertisement

Dr. Nori Lakshmi Bhaskar | త్రినేత్ర న్యూస్‌: నిమ్స్ అడిష‌న‌ల్ సూపరింటెండెంట్‌ డాక్ట‌ర్ ల‌క్ష్మీభాస్క‌ర్ (Dr. Nori Lakshmi Bhaskar) అవినీతి వ్య‌వ‌హ‌రంలో కొత్త లింకులు బ‌య‌ట‌పడ్డాయి. ఈ కేసుకు సంబంధించి డాక్ట‌ర్ లక్ష్మీభాస్కర్ అనుమానిత బినామీల ఇండ్ల‌లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మొత్తం చోట్ల త‌నిఖీలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిమ్స్ బార్బ‌ర్ (NIMS Barber) నివాసంలో భారీగా నోట్ల క‌ట్ట‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డాక్ట‌ర్ లక్ష్మీ భాస్కర్‌ అరెస్ట‌యిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిమ్స్‌కు (NIMS) చెందిన పలువురు ఉద్యోగులపై దృష్టిసారించిన ఏసీబీ అధికారులు.. వారి ఇండ్ల‌పై దాడులు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ద‌వాఖాన‌లో బార్బర్‌గా పని చేస్తున్న ధన్‌రాజ్ (Dhanraj) ఇంట్లో రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన డాక్యుమెంట్లు, నగదుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిలో ప్ర‌ధానంగా భూముల డాక్యుమెంట్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన ప‌త్రాలు ఉన్నట్లు తెలుస్తున్న‌ది.

సెప్టెంబర్‌ 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ (ACB Raids) అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అదే రోజు ఆయన నివాసంతోపాటు బంధువులు, సన్నిహితులు, అనుబంధ వ్యక్తులకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా దాదాపు రూ.80 కోట్లకుపైగా విలువైన స్థిర‌, చ‌రాస్తుల‌ను గుర్తించారు. ఇందులో కూక‌ట్‌ప‌ల్లిలో రెండు విలాస‌వంత‌మైన ఫ్లాట్లు, మ‌ణికొండ‌, పేట్ బ‌షీరాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లిలో 5 అపార్టుమెంట్ల‌లో ఫ్లాట్లు, యాదాద్రి, నందిగామ‌, శామీర్‌పేట ప్రాంతాల్లో 4 ఓపెన్‌ ప్లాట్లు, విశాఖ‌ప‌ట్నంలో 800 గ‌జాల స్థ‌లం, బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీస్‌ డిపాజిట్లు రూ.12 లక్షలు, ప్రైవేటు సంస్థ‌ల్లో రూ.35 లక్షల మేర‌ పెట్టుబడులు, రూ.29.55 లక్షల మ్యూచువల్‌ ఫండ్స్‌, 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు వెల్లడించింది. బ‌హిరంగా మార్కెట్లో ఆయ‌న ఆస్తుల విలు రూ.80 కోట్ల‌కుపైగా ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement