త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Crown Row | శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో బంగారు కిరీటం మాయం..?

Sabarimala Crown Row | కేర‌ళ (Kerala) లోని ప్రముఖ పుణ్య‌క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో (Sabarimala Temple) బంగారం చోరీ మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. 55.72 స‌వ‌ర్ల బంగారు కిరీటం ఆల‌య స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయ‌మైంది.

D

National | Published On Sep 24, 2026, 3.15 pm IST

Sabarimala Crown Row | శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో బంగారు కిరీటం మాయం..?
Advertisement

Sabarimala Crown Row | త్రినేత్ర న్యూస్ : కేర‌ళ (Kerala) లోని ప్రముఖ పుణ్య‌క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో (Sabarimala Temple) బంగారం చోరీ మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. స్వామికి 2012లో భక్తులు కానుక‌గా స‌మ‌ర్పించిన 55.72 స‌వ‌ర్ల బంగారు కిరీటం ఆల‌య స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయ‌మైంది. తిరువాభరణాల త‌నిఖీల స‌మ‌యంలో ఈ విష‌యాన్ని అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన శబరిమల బంగారం చోరీ కేసుకు సంబంధించి త‌నిఖీల సంద‌ర్భంగా ఈ భారీ గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది.

ఆలయంలో ద్వారపాలక దేవతా ప్రతిమలకు బంగారు పూత, గర్భగుడి ద్వారాలకు స్వర్ణ తాపడం రేకులు అమర్చే వ్యవహారంలో అవకతవకలపై దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమిషస్ క్యూరి జస్టిస్ కేటీ కీ శంకరన్ నేతృత్వంలో సన్నిధానం స్ట్రాంగ్‌రూమ్‌లో అధికారులు ఆడిట్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా భక్తులు విరాళంగా ఇచ్చిన కిరీటం మాయ‌మైన‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. భక్తులు విరాళంగా ఇచ్చిన అసలు కిరీటం బరువు 445.78 గ్రాములు కాగా, ప్రస్తుతం అక్కడ ఉన్న నకిలీ కిరీటం కేవలం 240 గ్రాములు మాత్రమే ఉన్న‌ట్లు తేలింది. అసలు కిరీటం స్థానంలో సరిగ్గా అదే పరిమాణం, డిజైన్‌తో కూడిన ఒక నకిలీ కిరీటాన్ని ఉంచినట్లు అధికారులు గుర్తించారు. డైమండ్లను పోలిన రాళ్లతో పొందుపరిచి ఉన్న ఈ నకిలీ కిరీటం బరువు.. అసలు కిరీటం కంటే దాదాపు 206 గ్రాములు తక్కువగా ఉండటం గమనార్హం.

2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ల బృందం స్వామివారికి ఈ కిరీటాన్ని సమర్పించింది. అధికారిక రికార్డుల ప్రకారం దీని మొత్తం బరువు 445.78 గ్రాములు. అంటే 55.72 స‌వ‌ర్ల‌న్న‌మాట‌. నిబంధనల ప్రకారం శబరిమకు వచ్చే ఇలాంటి విలువైన కానుకలను రికార్డుల్లో నమోదు చేసి సన్నిధానం స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. ఆ త‌ర్వాత ఆరన్ములలోని (Aranmula) దేవస్వం బోర్డు ప్రధాన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ, 2012 నాటి ఈ బంగారు కిరీటాన్ని ఆరన్ములకు ఎందుకు బదిలీ చేయలేద‌ని తేలింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. ఈ నిబంధన ఉల్లంఘనపై అధికారులు తీవ్ర విచారణ జ‌రుపుతున్నారు.

Also Read..

రెట్రో లుక్‌లో ర‌ణ‌భీర్‌క‌పూర్ - ల‌వ్ అండ్ వార్ ప్ర‌మోష‌న్స్ షురూ

పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

బీహార్‌లో మ‌రో దారుణం.. న‌డిరోడ్డుపై యువ‌తిని చుట్టుముట్టి

Advertisement
Advertisement