త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranbir Kapoor | రెట్రో లుక్‌లో ర‌ణ‌భీర్‌క‌పూర్ – ల‌వ్ అండ్ వార్ ప్ర‌మోష‌న్స్ షురూ

బాలీవుడ్ రియ‌ల్ లైఫ్ క‌పుల్ ర‌ణ‌భీర్‌క‌పూర్, అలియా భ‌ట్ జంట‌గా న‌టిస్తున్న మూవీ ల‌వ్ అండ్ వార్‌. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. పీరియాడిక‌ల్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా నుంచి ర‌ణ‌భీర్‌క‌పూర్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Sep 24, 2026, 3.11 pm IST

Ranbir Kapoor | రెట్రో లుక్‌లో ర‌ణ‌భీర్‌క‌పూర్ – ల‌వ్ అండ్ వార్ ప్ర‌మోష‌న్స్ షురూ
Advertisement

Ranbir Kapoor | బాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు ర‌ణ‌భీర్‌క‌పూర్‌, అలియా భ‌ట్ .ఈ రియ‌ల్‌లైఫ్ క‌పుల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏ దిల్ హై ముష్కిల్‌, బ్ర‌హ్మాస్త్ర సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. కొంత గ్యాప్ త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ల‌వ్ అండ్ వార్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 21న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

వ‌య‌లెంట్‌...

ల‌వ్ అండ్ వార్ మూవీ నుంచి ర‌ణ‌భీర్‌క‌పూర్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చాలా వ‌య‌లెంట్‌గా ఈ బాలీవుడ్ హీరో క‌నిపిస్తున్నారు. వింటేజ్ కారును ఒంటిచేతితో డ్రైవింగ్ చేస్తున్నాడు ర‌ణ‌భీర్‌క‌పూర్‌. మ‌రో చేయికి బుల్లెట్ త‌గిలిన గాయం, ర‌క్తం చిందుతున్న ప‌ట్టించుకోకుండా ప్ర‌శాంతంగా డ్రైవింగ్ చేస్తూ ఉండ‌టం పోస్ట‌ర్‌లో ఆస‌క్తిని పంచుతోంది. వింటేజ్ హెయిర్‌స్టైల్‌, గ్లాసెస్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ...

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్‌గా ర‌ణ‌భీర్‌క‌పూర్‌, ఎయిర్‌ఫోర్స్ అధికారిగా విక్కీ కౌశ‌ల్ క‌నిపించ‌బోతున్నారు. దేశం కోసం స‌రిహ‌ద్దుల్లో పోరాటం చేయాల్సిన వీరిద్ద‌రు ఓ అమ్మాయి కోసం ఎందుకు శ‌త్రువులుగా మారారు? ఇద్ద‌రు ఒకే అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ్డార‌నే అంశాల‌తో ల‌వ్ అండ్ వార్ సినిమా రూపొందుతోంది. దాదాపు నాలుగు వంద‌ల యాభై కోట్ల బ‌డ్జెట్‌తో సంజ‌య్ లీలా భ‌న్సాలీ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

 

Advertisement
Advertisement