Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
Teen Harassed By Group Of Men | బీహార్ (Bihar)లో మరో దారుణం వెలుగు చూసింది. సమస్తీపూర్ (Samastipur) జిల్లాలో ఓ యువతిని కొందరు యువకులు నడిరోడ్డుపై వేధింపులకు (Teen Harassed By Group Of Men) గురి చేయడం కలకలం రేపుతోంది.
Teen Harassed By Group Of Men | త్రినేత్ర న్యూస్ : బీహార్ (Bihar)లో యువత రెచ్చిపోతున్నారు. మైనర్లను వేధింపులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం జముయిలో ఇద్దరు మైనర్లపై ఓ మూక దాడి చేసి వేధింపులకు గురి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. సమస్తీపూర్ (Samastipur) జిల్లాలో ఓ యువతిని కొందరు యువకులు నడిరోడ్డుపై వేధింపులకు (Teen Harassed By Group Of Men) గురి చేయడం కలకలం రేపుతోంది.
జగత్‌సింగ్‌పూర్ గ్రామం (Jagatsinghpur village)లో పట్టపగలే నడిరోడ్డుపై ఓ బాలికను కొందరు యువకులు వేధించారు. యువతిని చుట్టుముట్టి అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు అదే గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కాగా, బీహార్‌లోని జముయిలో సెప్టెంబర్ 19న పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై దుండగులు దాడి చేసి వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి గాయాలతో పట్టుబడ్డాడు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే ఇప్పుడు తాజా ఉదంతం మహిళల భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తోంది.
Also Read..
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
ఐఆర్‌డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jamui Police Encounter | బీహార్ మైనర్ల వేధింపుల కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు అరెస్ట్
సెప్టెంబర్ 22, 2026

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
సెప్టెంబర్ 10, 2026

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?
- ●Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్‌డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
- ●Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ●PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం

PB Fintech | ఐఆర్‌డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..



