త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | శాంతి ఒప్పందం దిశ‌గా అమెరికా, ఇరాన్‌.. పాజిటివ్‌గా ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం పాజిటివ్‌గా ప్రారంభం అయ్యాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందంపై ఆశ‌లు పెర‌గ‌డం, గ్లోబ‌ల్ మార్కెట్లలో వ‌స్తున్న ర్యాలీ కార‌ణంగా పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ మెరుగుప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ 406.57 పాయింట్లు (0.53 శాతం) పెరిగి 77,424.36 వద్ద ప్రారంభమైంది.

S

Business | Published On May 6, 2026, 10.03 am IST

Stock Markets | శాంతి ఒప్పందం దిశ‌గా అమెరికా, ఇరాన్‌.. పాజిటివ్‌గా ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం పాజిటివ్‌గా ప్రారంభం అయ్యాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందంపై ఆశ‌లు పెర‌గ‌డం, గ్లోబ‌ల్ మార్కెట్లలో వ‌స్తున్న ర్యాలీ కార‌ణంగా పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ మెరుగుప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ 406.57 పాయింట్లు (0.53 శాతం) పెరిగి 77,424.36 వద్ద ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 138.20 పాయింట్లు (0.58 శాతం) లాభంతో 24,171.00 వద్ద ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 566.35 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 55,113.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. విస్తృత మార్కెట్లు కూడా ఈ ర్యాలీకి మద్దతు ఇచ్చాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు రెండూ 1 శాతం క‌న్నా ఎక్కువ లాభాలతో ట్రేడవుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో..

రంగాల వారీగా చూస్తే అన్ని సెక్టోరల్ సూచీలు గ్రీన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ, ఆటో, మెటల్స్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు అత్యధిక లాభాల‌ను నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా గత రాత్రి పాజిటివ్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ కంపోజిట్ సూచీలు రికార్డ్ క్లోజింగ్ గ‌రిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడానికి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నిలిచింది. ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే హోర్ముజ్ జ‌ల సంధి వద్ద నౌకల రక్షణ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపారు.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, రిక‌వ‌ర్ అయిన రూపాయి..

శాంతి ఒప్పందం అవకాశాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 2.19 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 107 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.62 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ప్రస్తుతం భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామాలు, అమెరికా-ఇరాన్ సంబంధాల‌పై వ‌స్తున్న వార్త‌లు భార‌త స్టాక్ మార్కెట్ల దిశ‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో క్రితం సెష‌న్‌లో భారీగా ప‌త‌న‌మైన భార‌త రూపాయి విలువ బుధ‌వారం సెష‌న్‌లో కాస్త రిక‌వ‌ర్ అయింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 12 పైస‌లు పెరిగిన భార‌త రూపాయి డాల‌ర్‌కు 95.05 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement