Corruption Case | ట్రాలీ బ్యాగుల్లో కట్టల కొద్దీ నగదు.. గనుల శాఖ అధికారి అవినీతి బాగోతం
Corruption Case | ఒడిశా గనుల శాఖ అధికారి (Odisha Mines Department officer) దేబబ్రత మొహంతీ (Debabrata Mohanty) నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా.. పెద్ద మొత్తంలో నగదు బయటపడింది. ట్రాలీ బ్యాగుల్లో ప్యాక్ చేసిన దాదాపు రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Corruption Case | ఒడిశా (Odisha)లో అవినీతి కేసు (Corruption Case)లో అరెస్టైన గనుల శాఖ అధికారి ఇంటి నుంచి భారీగా నగదు లభ్యమైంది. ట్రాలీ బ్యాగుల్లో ప్యాక్ చేసిన నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా గనుల శాఖ అధికారి (Odisha Mines Department officer) దేబబ్రత మొహంతీ (Debabrata Mohanty) ఇటీవలే అవినీతి కేసులో అరెస్టయ్యారు. తాజాగా భువనేశ్వర్‌లోని అతడి ఫ్లాట్‌లో అధికారులు సోదాలు చేపట్టగా.. పెద్ద మొత్తంలో నగదు లభ్యమైంది. ట్రాలీ బ్యాగుల్లో ప్యాక్ చేసిన దాదాపు రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని అధికారులు వెల్లడించారు.
లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా మొహంతి పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు మహంతిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన భువనేశ్వర్‌లోని ఆయన నివాసం తోపాటు పలు భద్రక్ జిల్లాలోని అతని తల్లిదండ్రుల ఇల్లు, కటక్‌లోని కార్యాయలంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మొహంతి ఆఫీస్‌లోని డ్రాలో రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక భువనేశ్వర్‌లోని ఫ్లాట్ నుంచి ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో దాచిన రూ.4 కోట్ల నగదు, 130 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, భువనేశ్వర్‌లో పహ్లాలో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లా ఉన్నట్లు గుర్తించారు. మొహంతీ అక్రమాస్తులు చూసి అధికారులే విస్తుపోతున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
https://x.com/OdishaVigilance/status/2026516316371501165
Also Read..
నమస్తే.. మోదీ పర్యటనను ఫ్రంట్ పేజీలో కవర్ చేసిన ఇజ్రాయెల్ మీడియా
సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ బలి
విరోష్ వెడ్డింగ్.. కాబోయే జంటకు ప్రత్యేక నోట్ పంపిన ప్రధాని మోదీ
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?






