Cervical Cancer | సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ బలి
Cervical Cancer | మన దేశంలోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ల (Cancers)లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా దాదాపు 42 వేల కంటే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ చనిపోతోంది.
Cervical Cancer | మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) కేసులు పెరిగిపోతున్నాయి. మన దేశంలోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా దాదాపు 42 వేల కంటే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ చనిపోతోంది.
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో. అందుకే వ్యాక్సిన్, ముందస్తు పరీక్షలతోనే ఈ క్యాన్సర్‌ను నివారించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ క్యాన్సర్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధమవుతోంది. త్వరలో దేశ వ్యాప్తంగా 14 ఏండ్లు దాటిన బాలికలను ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను (HPV Vaccine) అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గార్డాసిల్ ఇంజెక్షన్ (Gardasil)ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. దాదాపు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ జాతీయ స్థాయిలో అమలులోకి రావడం ద్వారా, గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనలో దేశానికి పెద్ద అడుగు ముందుకు వేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
రెండు మూడేళ్లకోసారి టెస్టు చేయించుకోవాలి..
సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ద్వారా సోకుతుంది. దీనిని పాప్‌స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించొచ్చు. ప్రతి రెండు మూడేళ్లకోసారి ఈ టెస్టు చేసుకోవడం ద్వారా వ్యాధి బారి నుంచి తప్పించుకునే అవకాశం ఏంది. అయితే, చాలా మందికి దీనిపై అవగాహన లేక.. వ్యాధి లక్షణాలు తెలియక వైద్యులను సంప్రదించడం లేదు. ఫలితంగా వ్యాధి ముదురుతున్నది. తర్వాత ట్రీట్‌మెంట్ మొదలు పెట్టినా ప్రాణాలు కాపాడడం కష్టమవుతున్నది.
హెచ్‌పీవీ అంటే..
హ్యూమన్ పాపిలోమా వైరస్.. దీన్నే హెచ్‌పీవీ అని అంటారు. ఇది 200 కంటే ఎక్కువ రకాల వైరస్‌ల సమూహం. ఇవి చర్మంపై మొటిమలు, గర్భాశయ ముఖద్వారం, యోని, నోరు, గొంతు క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఎక్కువ. ఇది ప్రధానంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. టీకా, క్రమం తప్పకుండా పరీక్షలు (HPV tests) చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్లను నివారించొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పలు నివేదికల ప్రకారం.. ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ వైరస్ బారిన పడుతుంటారు. చాలా సందర్భాల్లో శరీరం సహజంగానే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ వైరస్‌ను వదిలించుకుంటుంది. అయితే, వైరస్ తొలగిపోనప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో సుమారు 95 శాతం కేసులకు ఈ 'హై-రిస్క్' (అత్యంత ప్రమాదకర) HPV రకాలు శరీరంలోనే ఉండిపోవడమే ప్రధాన కారణం. ఈ వైరస్ ఇతర రకాల క్యాన్సర్లకు కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవే అత్యం ప్రమాదకరమైనవి..
ఈ వైరస్‌లో ముఖ్యంగా టైప్ 16, 18 రకాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గర్భాశయ ముఖద్వారంలో అసాధారణ కణ మార్పులకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. వీటిని తొలి దశలోనే గుర్తించకపోతే.. గర్భాశయ క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ పెరగకుండా అడ్డుకోవడంలో వ్యాక్సినేషన్ అత్యంత శక్తివంతమైన సాధనమని న్యూ ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) ప్రసూతి, గైనకాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ సీమా సింఘాల్ తెలిపారు. "హై-రిస్క్ HPV వైరస్‌ను అడ్డుకోవడంలో వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిన్న వయస్సులోనే బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్, క్యాన్సర్ ముందు దశ లక్షణాలు వచ్చే ప్రమాదాన్ని సుమారు 90 నుండి 95 శాతం వరకు తగ్గించొచ్చని పరిశోధనల్లో తేలింది" అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?






