త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheruvugattu | చెరువుగ‌ట్టులో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Cheruvugattu | నల్ల‌గొండ‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు (Cheruvugattu) శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి గుట్ట కింద భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది.

G

Telangana | Published On Jul 26, 2026, 7.47 am IST

Cheruvugattu | చెరువుగ‌ట్టులో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
Advertisement

Cheruvugattu | త్రినేత్ర‌.న్యూస్‌: నల్ల‌గొండ‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు (Cheruvugattu) శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి గుట్ట కింద భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. నంది విగ్రహం సమీపంలోని బొమ్మల దుకాణంలో శనివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప‌క్కనున్న దుకాణాలు, తోపుడు బండ్లకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రెండు గ్యాస్ సిలిండర్లు (Gas Cylinder Blast) పేల‌డంతో మంట‌లు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.

అర్ధ‌రాత్రి స‌మ‌యంలో అగ్నిప్రమాదం సంభ‌వించ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ప్రారంభంలో చిన్న‌గా మొద‌లైన మంట‌లు నిమిషాల వ్య‌వ‌ధిలోనే స‌మీపంలోని దుకాణాల‌కు దావాణంలా వ్యాపించాయి. దీంతో ప్ర‌మాద తీవ్ర‌త పెరిగింది. 17 బొమ్మల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెరువుగ‌ట్టు గ్రామ సర్పంచ్‌ తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో గ్రామ పంచాయతీ కార్యాల‌యం ఉండటంతో దానికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆఫీస్​ లోపల ప‌లు ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్ర‌మాదానికి సంబంధించిన ఖ‌చ్చిత‌మైన కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. కేసు న‌మోదుచేసిన పోసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
Advertisement