త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jurala Project | జూరాల‌ను తాకిన కృష్ణ‌మ్మ‌.. కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేస్తారా?

Jurala Project | మ‌హారాష్ట్ర‌తోపాటు క‌ర్ణాట‌క‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో కృష్ణా న‌దికి (Krishna River) వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో కృష్ణ‌మ్మ జూరాల‌ను (Jurala Project) తాకింది.

G

Telangana | Published On Jul 26, 2026, 9.19 am IST

Jurala Project | జూరాల‌ను తాకిన కృష్ణ‌మ్మ‌.. కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేస్తారా?
Advertisement

Jurala Project | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హారాష్ట్ర‌తోపాటు క‌ర్ణాట‌క‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో కృష్ణా న‌దికి (Krishna River) వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో కృష్ణ‌మ్మ జూరాల‌ను (Jurala Project) తాకింది. మ‌రోవైపు కృష్ణ‌కు ఉప‌న‌ది అయిన భీమాకు (Bhima) వ‌ర‌ద రావ‌డంతో మ‌హారాష్ట్ర‌లోని ఉజ్జయిని గేట్లు కూడా తెరుచుకున్నాయి. దీంతో అక్క‌డి నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టుకు వ‌స్తున్న‌ది. క్ర‌మంగా వ‌ర‌ద పెరుగ‌నున్న నేప‌థ్యంలో జూరాల కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆల్మట్టి డ్యామ్‌కు (Almatti) ఇన్‌ఫ్లో 84,888 క్యూసెక్కులుండగా.. 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం 108.660 టీఎంసీలున్నాయి. ఇక దిగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు (Narayanpur project) 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా.. 8 గేట్ల ద్వారా 24,560 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.96 క్యూసెక్కులున్నాయి.

Advertisement
Advertisement