Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu | ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఘర్షణలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుందని (peace in the world) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు.
Droupadi Murmu | ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఘర్షణలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుందని (peace in the world) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు. యుద్ధం ద్వారా కాకుండా పరస్పర చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని.. అందుకే భారత్ ఎప్పుడూ ప్రపంచం శాంతినే కోరుకుందన్నారు.
ఒడిశా (Odisha)లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మయూర్‌భంజ్ జిల్లా రైరంగ్‌పూర్‌లో (Rairangpur) జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో కలిసి ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ప్రపంచం యుద్ధం వంటి సంఘర్షణలు, అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా.. భారత్ శాంతి సందేశాన్ని అందించింది. సమస్యలను యుద్ధం ద్వారా కాకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు" అని ముర్ము పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంకితభావాన్ని ముర్ము కొనియాడారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో భారత్ ప్రదర్శించిన అద్భుతమైన నిర్వహణ సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ సమయంలో సొంత ప్రజలకు విజయవంతంగా టీకాలు వేయడమే కాకుండా.. అనేక ఇతర దేశాలకు కూడా టీకాలను సరఫరా చేసిందని గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న దేశాలకు సహాయం అందించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ముర్ము పేర్కొన్నారు.
Also Read..
ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!
పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్
సంబంధిత వార్తలు

President Droupadi Murmu | ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్
జూన్ 10, 2026

Truck rams car | షాకింగ్.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు
మే 30, 2026

Harmanpreet Kaur | భారత జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం.. పద్మశ్రీ అందుకోవడంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగ పోస్ట్..!
మే 26, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- ●Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు
- ●VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!
- ●Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు

VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ



