Virosh Wedding | విరోష్ వెడ్డింగ్.. కాబోయే జంటకు ప్రత్యేక నోట్ పంపిన ప్రధాని మోదీ
Virosh Wedding | టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-రష్మిక మందన్న (Rashmika Mandanna) మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే కొత్త జంటకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్ తల్లిదండ్రులు పంపిన ఆహ్వాన పత్రికకు స్పందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు.
Virosh Wedding | టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-రష్మిక మందన్న (Rashmika Mandanna) మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వెడ్డింగ్ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని (Udaipur Wedding) ఐటీసీ మెమోంటోస్ హోటల్‌లో ఫిబ్రవరి 26న జరగనుంది. ఇప్పటికే వధూవరులు తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అక్కడికి చేరుకున్నారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. నిన్న రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే కొత్త జంటకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్ తల్లిదండ్రులు పంపిన ఆహ్వాన పత్రికకు స్పందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు.
విజయ్-రష్మిక వివాహ వేడుకలకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. “విజయ్-రష్మికల జీవితంలో ఇది ఓ కొత్త అధ్యాయానికి నాంది. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో కలిసి ఏడడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా, భాగస్వాములుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నా” అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న – తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
జులై 26, 2026

Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
జులై 25, 2026

Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
జులై 25, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?



