Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
Kukatpally | హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి (Kukatpally) మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్నేహితులతో కలిసి క్రికెట్ (Cricket) ఆడేందుకు ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన టిప్పర్.. స్కూటీని ఢీకొట్టింది.
Kukatpally | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి (Kukatpally) మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్నేహితులతో కలిసి క్రికెట్ (Cricket) ఆడేందుకు ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన టిప్పర్.. స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సెలవు కావడంతో ఆదివారం ఉదయం మహేశ్ (17), లక్ష్మీ తేజ (17), మరో యువకుడు క్రికెట్ ఆడేందుకు స్కూటర్‌పై వెళ్లున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ (Metro Station) సమీపానికి చేరుకోగానే వారి బైక్‌ను టిప్పర్ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మహేశ్, లక్ష్మీ తేజ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. గాయపడిన మరో యువకుడిని స్థానిక దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన యువకులు మృతిచెందడటంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు






