త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komuravelli Railway Station | సాకార‌మైన ద‌శాబ్దాల క‌ల‌.. నేడు కొమురెల్లి మ‌ల్ల‌న్న రైల్వే స్టేష‌న్ ప్రారంభం..

Komuravelli Railway Station | సిద్దిపేట జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న (Komuravelli Mallanna Temple) క్షేత్రానికి ఇక‌పై సులువుగా చేరుకోవ‌చ్చు. ఆదివారం నుంచి రైల్వే సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

G

Telangana | Published On Jul 26, 2026, 9.50 am IST

Komuravelli Railway Station | సాకార‌మైన ద‌శాబ్దాల క‌ల‌.. నేడు కొమురెల్లి మ‌ల్ల‌న్న రైల్వే స్టేష‌న్ ప్రారంభం..
Advertisement

Komuravelli Railway Station | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్దిపేట జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న (Komuravelli Mallanna Temple) క్షేత్రానికి ఇక‌పై సులువుగా చేరుకోవ‌చ్చు. ఆదివారం నుంచి రైల్వే సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. కొముర‌వెల్లిలో నిర్మించిన రైల్వే స్టేష‌న్‌ను (Komuravelli Railway Station) ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2.20 గంట‌ల‌కే అక్క‌డికి డెమూ రైలు (Demu Rail) చేరుకోనుంది. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

భ‌క్తుల ద‌శాబ్దాల క‌ల సాకార‌మైంద‌ని తెలిపారు. స్థానిక సంస్కృతిని ప్ర‌తిబింబించేలా, ఆధునిక సౌకర్యాల‌తో స్టేష‌న్‌ను తీర్చిదిద్దామ‌ని చెప్పారు. మ‌ధ్యాహ్నం 1.30కి కొముర‌వెల్లికి చేరుకోనున్న కిష‌న్ రెడ్డి.. స్వామివారిని ద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రైల్వే స్టేష‌న్‌ను ప్రారంభిస్తారు. ఇక‌పై సిద్ధిపేట - సికింద్రాబాద్ - సిద్ధిపేట డెమూ రైలును కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్​లో ఆగనుంది. నిత్యం వేలాదిగా తరలివచ్చే భ‌క్తుల‌కు ఊరట కలిగ‌నుంది.

కొమురెల్లి మీదుగా ప్ర‌యాణిస్తున్నా..

సిద్ధిపేట - సికింద్రాబాద్‌ - సిద్ధిపేట డెమూ రైళ్లు కొమురవెల్లి మీదుగా ప్రయాణిస్తున్నా ఇక్కడ నిలవడం లేదు. భక్తుల కోరిక మేరకు స్టేషన్ నిర్మించడంతో ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే రెండు రైళ్లు ఇక్కడ నిలవనున్నాయి. సిద్ధిపేట - సికింద్రాబాద్ డెమూ (ట్రైన్ నంబర్ 77654), సికింద్రాబాద్ - సిద్ధిపేట డెమూ (ట్రైన్ నంబర్ 77655) ఈ నెల 26నుంచి, సిద్ధిపేట - సికింద్రాబాద్ డెమూ (ట్రైన్ నంబర్ 77656), సికింద్రాబాద్ - సిద్ధిపేట డెమూ (ట్రైన్ నంబర్ 77653) డెమూ ఈ నెల 27 నుంచి కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్​లో ఆగ‌నున్నాయి.

ట్రైన్ స‌మ‌యాలు..

  • ట్రైన్ నంబర్ 77654: సిద్ధిపేట - సికింద్రాబాద్ డెమూ (బుధవారం మినహా) మధ్యాహ్నం 2.20గంటలకు సిద్ధిపేటలో బయల్దేరి 2.29గంటలకు దుద్దెడ చేరుకుంటుంది. 2.30గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 2.38గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం, ఆ తర్వాత 2.27గంటలకు లకుడారం, సాయంత్రం 5.35గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • ట్రైన్‌ నంబర్ 77655: సికింద్రాబాద్ - సిద్ధిపేట డెమూ (బుధవారం మినహా) సాయంత్రం 5.50గంటలకు సికింద్రాబాద్​లో బయల్దేరుతుంది. రాత్రి 7.54గంటలకు లకుడారం, 8.04గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం, 8.14గంటలకు దుద్దెడ, 9.10గంటలకు సిద్ధిపేట చేరుతుంది.
  • ట్రైన్ నంబర్ 77656: సిద్ధిపేట-సికింద్రాబాద్ డెమూ (గురువారం మినహా) ఉదయం 6.45గంటలకు సిద్ధిపేటలో బయల్దేరి 6.55గంటలకు దుద్దెడ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి 7.04గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం, ఆ తర్వాత 7.15గంటలకు లకుడారం, రాత్రి 10.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • ట్రైన్ నంబర్ 77653: సికింద్రాబాద్ - సిద్ధిపేట డెమూ (బుధవారం మినహా) ఉదయం 10.35గంటలకు సికింద్రాబాద్​లో బయల్దేరుతుంది. మధ్యాహ్నం లకుడారం, 12.52గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం, 12.44గంటలకు దుద్దెడ, 2గంటలకు సిద్ధిపేట చేరుతుంది.
Advertisement
Advertisement