Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
Vemulawada Rajanna Temple | దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajanna Temple ) వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రూ.150 కోట్లు విడుదలచేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 99.40 కోట్ల నిధులు విడుదల చేసింది.
Vemulawada Rajanna Temple | త్రినేత్ర.న్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajanna Temple ) వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రూ.150 కోట్లు విడుదలచేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 99.40 కోట్ల నిధులు విడుదల చేసింది. రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ అధికారుల ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే 45 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నిధులతో మహామండపం, ధర్మగుండం, క్యూలైన్లు, భక్తులకు అవసరమైన ఆధునిక వసతుల నిర్మాణాలు మరింతవేగంగా పూర్తికానున్నాయి.
ఎములవాడ రాజన్న ఆలయాన్ని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. సుమారు రూ.548 కోట్లతో 3 దశల్లో పనులను చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి దశలో ప్రధాన ఆలయ విస్తరణ పనుల్ని చేపట్టారు. ఈ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, రూ.76కోట్లతో ప్రధానాలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు. రాజరాజేశ్వరుడు కొలువై ఉన్న మహామండపాన్ని తాకకుండా చుట్టూ ఆలయాన్ని 4ఎకరాల మేర విస్తరించనున్నారు. గతంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి కొత్త నిర్మాణాలు చేపట్టారు. చెరువు కట్టపై ఉన్న ప్రధానాలయ విస్తరణను పూర్తిగా రాఫ్ట్ ఫౌండేషన్ విధానంలో చేపడుతున్నారు. ఆలయ విస్తరణలో చుట్టూ 64 పిల్లర్లు రానున్నాయి. మహామండపం, నిత్య కళ్యాణ, వ్రత, అద్దాల, కోడెల, భక్తుల విశ్రాంతి మండపాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పిల్లర్లు, స్లాబ్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!





