PM Modi | నమస్తే.. మోదీ పర్యటనను ఫ్రంట్ పేజీలో కవర్ చేసిన ఇజ్రాయెల్ మీడియా
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇజ్రాయెల్ (Israel) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ టాప్ పత్రిక (Israeli newspaper) ఒకటి ఫ్రంట్ పేజిలో (front page) కథనం ప్రచురించింది.
International | Published On Feb 25, 2026, 1.13 pm IST
PM Modi | రెండు రోజుల పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక మోదీ రాకను ప్రకటిస్తూ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయనను తన స్నేహితుడిగా అభివర్ణించారు. ఇక మోదీ పర్యటనపై ఆ దేశ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ టాప్ పత్రిక (Israeli newspaper) ఒకటి ప్రధానికి స్వాగతం పలుకుతూ ఫ్రంట్ పేజిలో (front page) కథనం ప్రచురించింది.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా అక్కడి ప్రముఖ వార్తా పత్రిక 'ది జెరూసలేం పోస్ట్' (The Jerusalem Post) నమస్తే అంటూ మోదీ ఫొటోతో ఫ్రంట్ పేజిలో వార్తను ప్రచురించింది. ఈ విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ జ్వికా క్లైన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది 2017 తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక పర్యటన అని తెలిపారు. ఈ సందర్భంగా తాము ప్రత్యేకంగా రూపొందించిన 'ది జెరూసలేం పోస్ట్' కవర్ పేజీ ఇది అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ కానున్నారు. ముఖ్యమైన రక్షణ, వ్యూహాత్మక అంశాలపై చర్చిస్తారు. తన పర్యటనలో మొదటి రోజు(బుధవారం) మోదీ.. నెతన్యాహుతో ప్రైవేట్ విందులో పాల్గొంటారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Also Read..
HPV Vaccine | 14 ఏండ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా
Cervical Cancer | సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ బలి
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?






