త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | పండుగ‌ల ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..!

Special Trains | పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. దానాపూర్‌–ఎర్నాకుళం, రక్సౌల్‌–చర్లపల్లి, దానాపూర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. వీటితోపాటు కాన్పూర్‌ సెంట్రల్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది.

P

Telangana | Published On Nov 24, 2026, 8.30 am IST

Special Trains | పండుగ‌ల ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..!
Advertisement

Special Trains | పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. దానాపూర్‌–ఎర్నాకుళం, రక్సౌల్‌–చర్లపల్లి, దానాపూర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. వీటితోపాటు కాన్పూర్‌ సెంట్రల్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటన విడుదల చేసింది. దానాపూర్‌–ఎర్నాకుళం మధ్య 03221 నంబర్‌ ప్రత్యేక రైలు నవంబర్‌ 26న (గురువారం) రాత్రి 10.45 గంటలకు దానాపూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. ఈ రైలు అరా, బక్సర్‌, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్‌ ఛేవోకి, సత్నా, కట్నీ, జబల్‌పూర్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, బల్హర్‌షా, రామగుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్‌, కాట్పాడి, జోలార్‌పేట, బాలెం, ఈరోడ్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిస్సూర్‌, అలువా స్టేషన్లలో ఆగుతుంది.

చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ర‌క్సాల్‌కు..

ర‌క్సాల్‌-చ‌ర్ల‌ప‌ల్లి మధ్య 05527 నంబర్‌ ప్రత్యేక రైలు నవంబర్‌ 25న బుధవారం సాయంత్రం 4.55 గంటలకు అందుబాటులో ఉంటుంది. రక్సాల్ నుంచి బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 05528 నంబర్‌ రైలు నవంబర్‌ 27న శుక్రవారం రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు ర‌క్సాల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఘోరాసహన్‌, బైర్గానియా, సీతామఢి, జనక్‌పూర్‌ రోడ్‌, కమ్తౌల్‌, దర్భంగా, సమస్తిపూర్‌, బరౌనీ, ఖగారియా, జమాల్‌పూర్‌, జ‌స్దీహ్‌, మధుపూర్‌, చిత్రంజన్‌, ధన్‌బాద్‌, కత్రాస్‌గఢ్‌, చంద్రపురా, బొకారో స్టీల్‌ సిటీ, మూరి, రాంచీ, రూర్కెలా, ఝార్సుగూడ, రాయ్‌గఢ్‌, బిలాస్‌పూర్‌, రాయ్‌పూర్‌, దుర్గ్‌, రాజ్‌నంద్‌గావ్‌, గొండియా, వడ్సా, బల్హర్‌షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.

బెంగ‌ళూరు-దానాపూర్‌కు..

దానాపూర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ మధ్య 03241 నంబర్‌ ప్రత్యేక రైలు నవంబర్‌ 25న బుధవారం రాత్రి 8.45 గంటలకు దానాపూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బెంగళూరు కంటోన్మెంట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 03242 నంబర్‌ రైలు నవంబర్‌ 28న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు అరా, బక్సర్‌, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్‌ ఛేవోకి, సత్నా, కట్నీ, జబల్‌పూర్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, బల్హర్‌షా, కాజీపేట, సికింద్రాబాద్‌, వికారాబాద్‌, కృష్ణా, రాయచూర్‌, గుంటకల్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌, యలహంక స్టేషన్లలో ఆగుతాయి.

బెంగుళూరు టూ కాన్పూర్‌..

కాన్పూర్‌ సెంట్రల్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడిచే 04131, 04132 ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా రైల్వే పొడిగించింది. 04131 నంబర్‌ రైలు నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 27 వరకు ప్రతి ఆదివారం కాన్పూర్‌ సెంట్రల్‌ నుంచి బెంగళూరుకు ఆరు ట్రిప్పులు నడుస్తుంది. 04132 నంబర్‌ రైలు నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 30 వరకు ప్రతి బుధవారం బెంగళూరు నుంచి కాన్పూర్‌ సెంట్రల్‌కు ఆరు ట్రిప్పులు నడపనుంది. ఈ రైళ్లు ఫతేపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, శంకర్‌గఢ్‌, దభౌరా, మాణిక్‌పూర్‌, సత్నా, కట్నీ, మదన్మహల్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, బల్హర్‌షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, చిరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Advertisement
Advertisement