Bengaluru Metros Pink Line | బెంగళూరు మెట్రో పింక్‌లైన్ ప్రారంభం.. సీఎం డీకేతో ప్రధాని మెట్రో రైడ్
Bengaluru Metros Pink Line |బెంగళూరు మెట్రో పింక్‌లైన్‌ను (Bengaluru Metros Pink Line) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి స్వయంగా టికెట్ తీసుకున్న ప్రధాని.. తావరెకెరె నుంచి ఐఐఎం మెట్రో స్టేషన్ వరకు దాదాపు 7.5 కిలోమీటర్లు మెట్రో రైలులో ప్రయాణించారు.
Bengaluru Metros Pink Line | త్రినేత్ర న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (CM DK Shivakumar)తో కలిసి బెంగళూరు మెట్రో పింక్‌లైన్‌ను (Bengaluru Metros Pink Line) అధికారికంగా ప్రారంభించారు. కలేన అగ్రహార-తావరకెరె మార్గంలో సుమారు రూ.3470 కోట్లతో నిర్మించిన మెట్రో పింక్‌లైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి స్వయంగా టికెట్ తీసుకున్న ప్రధాని.. తావరెకెరె నుంచి ఐఐఎం మెట్రో స్టేషన్ వరకు దాదాపు 7.5 కిలోమీటర్లు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సుధా యాదవ్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, మంత్రి కేబీ గౌడ పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని తెలిపారు. మెరుగైన అనుసంధానత ప్రగతికి, ఉపాధికి, పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే పేదరికానికి వ్యతిరేకంగా చేసే పోరాటం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవలే కాలంలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుంచి బయటపడటానికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. 2014లో కేవలం 14 కిలోమీటర్ల మేర మాత్రమే ఉన్న 'నమ్మ మెట్రో' నెట్‌వర్క్ నేడు 100 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని ప్రధాని గుర్తుచేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల తర్వాత మెట్రో నెట్‌వర్క్‌లో సెంచరీ (100 కి.మీ) దాటిన దేశంలోని మూడో పట్టణ కేంద్రంగా బెంగళూరు నిలిచిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read..
నాతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ .. మోదీకి అంతసీన్ లేదు : రాహుల్ గాంధీ
భారత్ చొరవతోనే యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు : ప్రధాని మోదీ
హైదరాబాద్ నుంచే 40 శాతం ఆదాయముంది.. ఇది అభివృద్ధిలో అసమతుల్యతకు నిదర్శనం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
నవంబర్ 14, 2026

Abki Baar AQI 400-Paar | ‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
నవంబర్ 14, 2026

Sam Pitroda | ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



