KTR | ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఆరోపణలు గుప్పించారు. తాము నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి దక్కాలని తాము టీ-హబ్‌ను (T-Hub) నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ (Anumula Hubs) ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శించారు.
KTR | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఆరోపణలు గుప్పించారు. తాము నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి దక్కాలని తాము టీ-హబ్‌ను (T-Hub) నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ (Anumula Hubs) ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇది కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మీరు అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా వందల కోట్లు విలువైన భూములు దక్కించుకోవచ్చని చెప్పారు.
సున్నా పెట్టుబడితో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించినందుకు ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని (Anumula Kondal Reddy) ప్రకటించాల్సిందే. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన ‘బిజినెస్ మోడల్’ ఏంటో నేర్పించండి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ (Magic Trick) కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలి? తెలంగాణ యువత మొత్తానికి నేర్పించాలని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
- ●Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
- ●Hyderabad | పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం..
- ●Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
- ●Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ

Hyderabad | పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం..

Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?






