Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ
Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో కన్నడ నటి రన్యారావు (Actor Ranya Rao)కు కస్టమ్స్ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆమెకు ఏకంగా రూ. 89 కోట్ల భారీ జరిమానా విధించింది.
Actor Ranya Rao | త్రినేత్ర న్యూస్ : దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని (Gold Smuggling Case) తరలిస్తూ అధికారులకు పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Actor Ranya Rao)కు కస్టమ్స్ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆమెకు ఏకంగా రూ. 89 కోట్ల భారీ జరిమానా విధించింది. రన్యారావుతోపాటు ఈ కేసులోని ఇతర నిందితులైన సాహిల్ జైన్‌కు రూ.53.06 కోట్లు, భరత్ కుమార్ జైన్‌కు రూ. 53.06 కోట్లు, తరుణ్ కొండూరు రాజుకు రూ. 49.51 కోట్ల జరిమానా విధించింది. మొత్తంగా ఈ కేసులో నలుగురు నిందితులకు కలిపి రూ. 244 కోట్లకు పైగా ఫైన్ వేసింది.
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ గతేడాది మార్చిలో బెంగళూరు (Bengaluru) అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. నిందితులు దాదాపు ఏడాది కాలంలో 113 కిలోల బంగారాన్ని రవాణా చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
విచారణలో భాగంగా రన్యారావు కీలక విషయాలు వెల్లడించింది. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి రూ.4 నుంచి రూ.5 లక్షలు తీసుకుంటుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ కేసులో ఆమెకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇప్పటికే ఆమెకు రూ. 102 కోట్ల జరిమానా కూడా విధించింది.
Also Read..
బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు లేదు
అపార్ట్‌మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక
విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్పటికీ విలువైనదే: డీజీపీ సీవీ ఆనంద్
సంబంధిత వార్తలు

Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
సెప్టెంబర్ 29, 2026

DK Shivakumar | బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 26, 2026

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..
- ●Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర
- ●Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు
- ●Ntr | ఎన్టీఆర్ వాచ్ ధర రెండు కోట్లా? - చిన్న సినిమా బడ్జెట్‌తో సమానమంటూ నెటిజన్ల కామెంట్లు
- ●B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
- ●Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి

Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..

Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర

Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు

Ntr | ఎన్టీఆర్ వాచ్ ధర రెండు కోట్లా? - చిన్న సినిమా బడ్జెట్‌తో సమానమంటూ నెటిజన్ల కామెంట్లు



