త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Holidays | బ్యాంకుల‌కు ప్ర‌తి శ‌నివారం సెల‌వు లేదు

Bank Holidays | ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించారంటూ (All Saturdays bank holidays) సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి గెజిట్ విడుద‌ల (Gazette notification) చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Oct 1, 2026, 3.04 pm IST

Bank Holidays | బ్యాంకుల‌కు ప్ర‌తి శ‌నివారం సెల‌వు లేదు
Advertisement

Bank Holidays | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించారంటూ ఇవాళ ఉద‌యం నుంచి తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించిన ప్ర‌భుత్వ గెజిట్ జాతీయ మీడియా, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ప్ర‌చారంపై ప్ర‌భుత్వం స్పందించింది. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ఖండించింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని కొట్టిపారేసింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ప్ర‌తి శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) ఎలాంటి గెజిట్ విడుద‌ల చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌ప్పుడు క‌థ‌నాల‌కు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check)తో చెక్ పెట్టింది.

కాగా, ప్ర‌తి శ‌నివారం సెల‌వు దినంగా ప్ర‌క‌టించాలంటూ బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. వారానికి ఐదు ప‌నిదినాలు కోరుతూ బ్యాంకు యూనియ‌న్లు ఇటీవ‌లే స‌మ్మెకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల అనంత‌రం చివ‌రి నిమిషంలో త‌మ స‌మ్మెను విర‌మించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తి శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసిన‌ట్లు వార్త‌లు పుట్టుకొచ్చాయి. దీనిపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ఎలాంటి గెటిజ్ విడుద‌ల చేయ‌లేద‌ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్ప‌ష్టం చేసింది.

Also Read..

సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్ర‌ధాని మోదీ

మ‌మ‌త వ‌ర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ‌

నేనే ఖైర‌తాబాద్ అభ్య‌ర్థిని.. దానం ఎంపీ అభ్య‌ర్థి

Advertisement
Advertisement