త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్ప‌టికీ విలువైన‌దే: డీజీపీ సీవీ ఆనంద్‌

DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం, చేయూత ఎప్పటికీ విలువైనదేనని, అది సమాజ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 1, 2026, 3.27 pm IST

DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్ప‌టికీ విలువైన‌దే: డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

- యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు రూ.2 కోట్లు అంద‌జేసిన ఎంవైకే లాటిక్రెట్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ మురళీ

DGP Anand | త్రినేత్ర న్యూ: విద్య కోసం ఇచ్చే విరాళం, చేయూత ఎప్పటికీ విలువైనదేనని, అది సమాజ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు ఎంవైకే లాటిక్రెట్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ మురళీ యాదమ రూ.2 కోట్ల విరాళంగా ఇవ్వ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. త‌ర‌త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతూ స‌మాజంపై శాశ్వ‌త ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్పారు. డీజీపీ కార్యాలయంలో గురువారం మురళీ యాదమ డీజీపీకి చెక్కు అంద‌జేసిన సంద‌ర్భంగా మాట్లాడారు.

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయం. విద్య కోసం అందించే సహాయం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుంది. దాని ప్రయోజనాలు భవిష్యత్‌ తరాలకు కూడా అందుతాయి. మంచిరేవులలోని YIPS అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ఎంవైకే లాటిక్రెట్‌ (ఎంవైకే ఫౌండేషన్‌) రూ.2 కోట్ల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఈ విరాళాన్ని అందించింది.

పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించడమే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లక్ష్యం. విద్యా సంస్థల నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, దాతలు, ఇతర భాగస్వాములు అందిస్తున్న సహకారం ప్రాజెక్టుకు మరింత బలాన్నిస్తుంది అని డీజీపీ ఆనంద్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement