Cyberabad | అపార్ట్‌మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా సర్వీస్ అపార్ట్‌మెంట్స్ యజమానులకు సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Cyberabad | త్రినేత్ర న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా సర్వీస్ అపార్ట్‌మెంట్స్ యజమానులకు సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లలో వ్యభిచారం, జూదం వంటి కార్యకలాపాలు కొనసాగినట్లు తమ దృష్టికి వస్తే.. సంబంధిత ఆస్తి జప్తు చేస్తామని హెచ్చరించారు. ఆస్తులను జప్తు చేసే అధికారం తమకు ఉందని ఆయన తేల్చిచెప్పారు.
ఎందుకంటే..?
ఇటీవల మాదాపూర్ పరిధిలోని పలు సర్వీస్ అపార్ట్‌మెంట్లలో జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు.. పోలీసుల దాడుల్లో వెలుగు చూశాయి. గత నెల 27వ తేదీన అయ్యప్ప సొసైటీలోని వైట్ క్యాజిల్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేయగా, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అదే ఏరియాలో ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లో జూదం ఆడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అద్దెకిచ్చే ముందు ఇది తప్పనిసరి
సర్వీస్ అపార్ట్‌మెంట్లను అద్దెకు ఇచ్చే సమయంలో అద్దెకు తీసుకుంటున్నవారి వివరాలను తీసుకోవాలని పోలీసులు యజమానులకు సూచించారు. అద్దెకు దిగే వారి ఐడీ కార్డులు, ఇతర వివరాలను సేకరించాలి. అవసరమైతే లిఖిత పూర్వకంగా కారణం రాసివ్వమని అడగాలి. ఎంతమంది వస్తున్నారు..? ఎందుకు వస్తున్నారు..? అనే వివరాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల అద్దెకు ఉన్న వారు ఏదైనా తప్పు చేస్తే యజమానులకు ఆ అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని నిరూపించుకోవడానికి సహాయపడుతుందని పోలీసులు తెలిపారు. ఇక అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసి కూడా అద్దెకు ఇస్తే.. యజమానులపై కేసులు తప్పవు.. అంతేకాకుండా ఆ ప్రాపర్టీని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
సెప్టెంబర్ 29, 2026

DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్
సెప్టెంబర్ 26, 2026

Ganesh Immersion | ఎల్లుండి ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు.. 10 వేల కెమెరాలతో నిఘా
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..
- ●Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ●Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
- ●MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్జీలు : ఎంపీ మల్లు రవి
- ●Sudigali Sudheer | ఎట్టకేలకు థియేటర్లలోకి సుడిగాలి సుధీర్ కాంట్రవర్షియల్ మూవీ - హీరోయిన్గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ
- ●Gold Prices | సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. దీపావళి సీజన్ కలిసొచ్చేనా..?

Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు

MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్జీలు : ఎంపీ మల్లు రవి



