త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌..? మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మాజీలు..!

IPL 2027 | ఐపీఎల్‌–2027 (IPL 2027)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా రింకూ సింగ్‌ నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవని, రింకూనే సరైన ఎంపికని పేర్కొన్నాడు.

P

Sports | Published On Nov 28, 2026, 8.29 pm IST

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌..? మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మాజీలు..!
Advertisement

IPL 2027 | ఐపీఎల్‌–2027 (IPL 2027)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా రింకూ సింగ్‌ నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవని, రింకూనే సరైన ఎంపికని పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా రింకూ వైపే మొగ్గుచూపాడు. అజింక్య రహానే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కేకేఆర్‌లో కెప్టెన్సీ ఖాళీ ఏర్పడింది. గత సీజన్‌లో రింకూ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడని, ఈ నేపథ్యంలో అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

అయితే, గతంలో జట్టుకు నాయకత్వం వహించిన సునీల్ నరైన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా పరిశీలించవచ్చని పేర్కొన్నాడు. వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను కొనుగోలు చేసి సారథిగా నియమించే అవకాశాన్ని కూడా కేకేఆర్ పరిశీలించవచ్చని పఠాన్ సూచించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు అట్టిపెట్టుకోవడంపై ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడిని విడుదల చేసి ఉంటే వేలంలో తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. యాషెస్ సిరీస్ నేపథ్యంలో గ్రీన్ అందుబాటుపైనా సందేహాలున్నాయని, అతడి ఫిట్‌నెస్ కూడా కీలకమని పేర్కొన్నాడు. కేకేఆర్ వేలంలో రూ.41 కోట్ల పర్స్‌తో బరిలోకి దిగనుంది.

కేకేఆర్ జట్టు దాదాపు పూర్తయినప్పటికీ మరో ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్ అవసరమని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ తెలిపాడు. గత సీజన్‌లో గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జట్టుకు హర్షిత్ రాణా తిరిగి అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశమన్నాడు. వైభవ్ అరోరా, సౌరభ్ దూబే రూపంలో మంచి బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పేర్కొన్నాడు. నితీశ్ రాణా, అభిషేక్ పోరెల్, నెహాల్ వధేరా వంటి బ్యాటర్లు వేలంలో అందుబాటులో ఉండటం కేకేఆర్‌కు ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలంలో కెప్టెన్సీతో పాటు మిగిలిన స్థానాలపై కేకేఆర్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement