Ram Mandir Donations Row | వాష్‌రూమ్స్‌లో నగదు దాచి.. గుట్టుచప్పుడు కాకుండా తరలించాం.. దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు
Ram Mandir Donations Row | అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) చోరీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకరు సంచలన విషయాలు బయటపెట్టారు. దొంగిలించిన సొమ్మును (Ram Temple donation theft case) తొలుత ఎవరికీ అనుమానం రాకుండా వాష్‌రూమ్స్‌లో దాచి (Hid money in washrooms).. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించే వారని వెల్లడించారు.
Ram Mandir Donations Row | అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకరు సంచలన విషయాలు బయటపెట్టారు. దొంగిలించిన సొమ్మును (Ram Temple donation theft case) తొలుత ఎవరికీ అనుమానం రాకుండా వాష్‌రూమ్స్‌లో దాచి (Hid money in washrooms).. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించే వారని వెల్లడించారు. అంతేకాదు, అధికారుల కంటపడకుండా తప్పించుకున్న తీరు, విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను కూడా అతను పూసగుచ్చినట్లు వివరించారని పోలీసులు తాజాగా తెలిపారు.
అరెస్టైన ఎనిమిది మందిని కోర్టు అనుమతితో పోలీసులు విచారించారు. అవినాష్ శుక్లా అనే నిందితుడిని పోలీసులు సుమారు రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ విచారణలో తాను కోట్ల రూపాయల నగదును దొంగిలించినట్లు అతడు అంగీకరించాడు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును కూడా శుక్లా విచారణలో ప్రస్తావించినట్లు తెలిసింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారని నిందితుడు ఆరోపించాడు.
నిఘా కెమెరాల నుంచి తప్పించుకుని..
విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన తాళం చెవుల్లో ఒకటి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కి అత్యంత సన్నిహుతుడైన టిన్ను యాదవ్ వద్ద ఉండేదని.. మరొకటి బ్యాంకు ఉద్యోగుల వద్ద ఉండేదని నిందితుడు శుక్లా తెలిపాడు. ఈ దొంగతనం ఒకరిద్దరు చేసిందన కాదని కుండ బద్దలు కొట్టాడు. పలువురి సమన్వయంతో డబ్బును గుట్టుచప్పుడు కాకుండా పక్కకు తరలించినట్లు వివరించాడు. ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిందితులకి బాగా తెలుసునని.. నిఘా కెమెరాల నుంచి తప్పించుకుని డబ్బును తొలుత వాష్‌రూమ్స్‌లో దాచి ఆ తర్వాత ఈజీగా తరలించినట్లు తెలిపాడు.
మాపై ఎవరికీ అనుమానం రాలేదు..
ఇక ట్రస్ట్‌తో సంబంధం ఉన్న కీలక వ్యక్తులకు తాము అత్యంత సన్నిహితులు కావడంతో తమపై ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదని చెప్పుకొచ్చాడు. అలాగే తమ కదలికలపై నిఘా కూడా చాలా తక్కువగా ఉండేదని శుక్లా విచారణలో వెల్లడించాడు.
ఇళ్లు, స్థలాల కొనుగోలు..!
ఆలయ విరాళాల నుంచి మాయం చేసిన సొమ్ముతో తాము భూములు, ఇళ్లు కొనుగోలు చేసినట్లు శుక్లా అంగీకరించాడు. దీంతో నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారి ఆర్థిక లావాదేవీలు, నిందితులకు ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.
కాగా, ఆలయ విరాళాల నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గత వారమే తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కానుకల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్న అవినాష్ శుక్లాతో పాటు , చంపత్ రాయ్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న రమాశంకర్ అలియాస్ టిన్ను యాదవ్, విరాళాల లెక్కింపు ఇన్‌ఛార్జ్ సుభాష్ శ్రీవాస్తవ, లెక్కింపు సిబ్బంది అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, రామ్ శంకర్ మిశ్రా, కరుణేష్ పాండేలు ఉన్నారు.
Also Read..
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!
బంగారం కొనేవారికి షాక్.. 70 శాతానికి పైగా తగ్గిన డిమాండ్.. భారీగా పెరిగిన పాత నగల అమ్మకాలు..
రైల్వేలో 6565 టెక్నీషియన్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లోనూ ఖాళీలు.. దరఖాస్తులు షురూ..
సంబంధిత వార్తలు

V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట
జులై 31, 2026

Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే
జులై 13, 2026

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
జులై 8, 2026
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!



