Namaz inside Ayodhya's Ram Mandir | అయోధ్య రామ మందిరంలో జైశ్రీరామ్ నినాదాలకు బదులు అల్లా నినాదం వినపడటంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కశ్మీర్‌కు చెందిన అహ్మెద్ షేక్ అనే వ్యక్తి అయోధ్యలోని రామ మందిరంలోనికి వెళ్లి అక్కడ ఉన్న సీతా రాసోయ్ ఏరియా వద్ద కూర్చొని నమాజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అహ్మెద్ కదలికలను చూసి అనుమానించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయన నమాజ్ చేసే విషయాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అహ్మెద్‌ని లోకల్ పోలీసులకు అప్పగించారు. అతడి మోటివ్ ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అతడి దగ్గర జీడిపప్పు, కిస్‌మిస్ ఉండటాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. కశ్మీర్‌లోని సోఫియా జిల్లాకు చెందిన అహ్మెద్ ఎందుకు రామ మందిరంలోకి వచ్చాడో తెలియక అక్కడి స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకోగానే నినాదాలు చేశాడని తెలుస్తోంది. అతడు ఎటువంటి నినాదాలు చేశాడు అనేదానిపై క్లారిటీ రాలేదు. వచ్చే వారంలో మకర సంక్రాంతి వేడుకల కోసం ఓ వైపు అయ్యోధ రామ మందిరం ముస్తాబు అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. వచ్చే వారం లక్షలాది మంది భక్తులు ఆలయానికి రానున్న నేపథ్యంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు.