త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | రాముని బాట‌లో రేవంత్.. రావ‌ణాసురుడి బాట‌లో బీజేపీ

MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కొన‌సాగుతుంద‌ని, రావ‌ణాసురుడి బాట‌లో బీజేపీ నాయ‌కులు వెళ్తున్నార‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 1, 2026, 12.23 pm IST

MP Mallu Ravi | రాముని బాట‌లో రేవంత్.. రావ‌ణాసురుడి బాట‌లో బీజేపీ
Advertisement

MP Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్ : రాముని బాటలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కొన‌సాగుతుంద‌ని, రావ‌ణాసురుడి బాట‌లో బీజేపీ నాయ‌కులు వెళ్తున్నార‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పై మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు.

మూడు రోజులుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన అట్టర్ ప్లాప్ షోగా ముగిసింది. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అని నితిన్ నబీన్ ప్రకటించారు. అది బీజేపీ వల్ల కాదు.. ఎవరి వల్ల కాదు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలు కంటుంది. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు.. ఇక్కడ బీజేపీ మత రాజకీయాలు చెల్లవని మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందరి సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధి కి కృషి చేస్తున్నారు. రాముడి బాటలో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించే సత్తా బీజేపీకి లేదు. ఇచ్చిన మాట ప్రకారం పాలన సాగిస్తు ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి పాలనను బీజేపీ విమర్శించడం వారి మూర్ఖత్వం. 40 ఏళ్లుగా అయోధ్య రామ మందిరం పేరు చెప్పుకుని రాజకీయాలు చేసిన బీజేపీ అక్కడే దేవుని సొమ్మును దిగమింగింది. పాప భీతి లేకుండా దేవుడి సొమ్ము మింగిన బీజేపీకి ఇక ముక్త భారత్ అవుతుంది. తెలంగాణలో అధికారంలోకి రావడం కాదు దేశంలోనే బీజేపీ అడ్రెస్ లేకుండా పోతుంది. బీజేపీ అత్యున్నత స్థాయిలో ఉన్న అయోధ్యలోనే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రంలో రాముడి సొమ్మును మింగిన బీజేపీ కి ఇంకా పుట్టగతులు ఉండవ‌ని మ‌ల్లు ర‌వి హెచ్చ‌రించారు.

దేశంలో బీజేపీకి కాలం చెల్లిందని అయోధ్యలో ప్రతి ఒక్కరు అంటున్నారు. అవినీతి, నియంత పాలన అక్రమాలతో బీజేపి దేశంలో ఒక రావనసుర పాలన సాగిస్తోంది. బీజేపీకి ఇవ్వే చివరి ఎన్నికలు.. ఇంకా బీజేపీ దేశంలో ఎంతో కాలం ప్రజలను మోసం చేసి పాలన సాగించలేదు. రాబోయే కాలం దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం అని మల్లు ర‌వి పేర్కొన్నారు.

Advertisement
Advertisement