RRB Technician | రైల్వేలో 6565 టెక్నీషియన్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లోనూ ఖాళీలు.. దరఖాస్తులు షురూ..
RRB Technician | రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 6565 టెక్నీషియన్ (RRB Technician) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టింది.
RRB Technician | త్రినేత్ర.న్యూస్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 6565 టెక్నీషియన్ (RRB Technician) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టింది. బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఐటీఐ చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులను rrb.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో జూలై 29 వరకు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 21 రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 399 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 6,565
ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్- 323 ఖాళీలు, టెక్నీషియన్ గ్రేడ్-III - 6,242 ఖాళీలు ఉన్నాయి.
(జనరల్ 2728, ఓబీసీ 1565, ఎస్సీ 1009, ఎస్టీ 597, ఈడబ్ల్యూఎస్ 658, ఎక్స్‌సర్వీస్ మెన్ 661)
సికింద్రాబాద్ రీజియన్‌లో..
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్- 4 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-III - 395 పోస్టులు
అర్హతలు
పదో తరగతి, ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థుల వయసు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 33 ఏండ్ల మధ్య, గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.29,200, గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది.
పరీక్ష విధానం
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్‌కు సంబంధించిన ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు - 10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు - 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు - 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు - 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు - 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
టెక్నీషియన్ గ్రేడ్-III ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రంలో మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు - 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు - 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు - 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీలు, మాజీ సైనికోద్యోగులు, ట్రాన్స్‌జెండర్‌లు, మైనారిటీలు రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29
వెబ్సైట్: https://www.rrbapply.gov.in
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్






