Chevella | ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
Chevella | కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థి క్షణాల్లోనే కన్నుమూశాడు.
Chevella | త్రినేత్ర.న్యూస్ : కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థి క్షణాల్లోనే కన్నుమూశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండల పరిధిలోని కందాడ గ్రామానికి చెందిన షేర్ కృష్ణారెడ్డి రెండో కుమారుడు సాత్విక్ రెడ్డి.. మొయినాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక బుధవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరిన సాత్విక్ రెడ్డి.. బస్సు కోసం షాబాద్ చౌరస్తా వద్ద ఆగాడు. అదే సమయంలో అటు వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. దాని ముందున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కన నిల్చున్న సాత్విక్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
- ●Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
- ●Satyavathi Rathod | ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చారు
- ●Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
- ●DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి

Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

Satyavathi Rathod | ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చారు

Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?

DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్




