TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఆ రూట్‌లో పెరిగిన బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు..
TGSRTC | బెంగళూరు (Bengaluru)-హైదరాబాద్ (Hyderabad) మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్), అలైటింగ్ (బస్ దిగే పాయింట్) పాయింట్లను భారీగా పెంచింది.
TGSRTC | త్రినేత్ర.న్యూస్: బెంగళూరు (Bengaluru)-హైదరాబాద్ (Hyderabad) మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్), అలైటింగ్ (బస్ దిగే పాయింట్) పాయింట్లను భారీగా పెంచింది. ప్రయాణికులు తమకు నచ్చిన, దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను క్రమబద్ధీకరించింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
బెంగళూరులో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు..
- పీనియా రూట్ (via Peenya): పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ (Yeshwanthpur Metro Station), కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్ (Hebbal), ఎస్టీమ్ మాల్ (Esteem Mall), ఎలాహంక (Yelahanka), బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్
- చందాపూర్ రూట్ (via Chandapura) : చందాపూర్, బొమ్మసంద్ర (Bommasandra), ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City), బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ (Madiwala), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
- మార్తహళ్లి రూట్ (via Marathahalli): వర్తూర్ జంక్షన్ (Varthur Junction), మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి (Domlur Bridge), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
హైదరాబాద్‌లో..
- బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయి..
- పటాన్‌చెరు రూట్: పటాన్‌చెరు నుండి ఎంజీబీఎస్ (MGBS), ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
- జేబీఎస్ రూట్: జేబీఎస్ (JBS) నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
హయత్ నగర్ రూట్: హయత్ నగర్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు ఉన్నాయి..
టీజీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ప్రయాణికులకు ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఎంచుకుని, సురక్షితమైన మరియు సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని యాజమాన్యం సూచించింది. ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Mahesh Babu | మహేష్ బాబు ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌కు 35 లక్షల ఫైన్ – రూమర్లపై క్లారిటీ ఇదిగో!
జూన్ 30, 2026

DGP Anand | స్పెషల్ బెటాలియన్ల సేవలు దగ్గరుండి చూశా.. రాష్ట్ర భద్రతకు వారు ఎంతో అవసరం: డీజీపీ సి.వి.ఆనంద్
జూన్ 30, 2026

Raja Singh | రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు..!
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●KC Venugopal | బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్
- ●Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా
- ●GST | జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..
- ●Gen Dhiraj Seth | 'విజయ్' నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
- ●Chevella | ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
- ●MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ

KC Venugopal | బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్

Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా

GST | జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..

Gen Dhiraj Seth | 'విజయ్' నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్



