త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడ‌ల్‌.. 4 సెక‌న్ల‌లో ఏఐ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది..

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఏఐ ఇమేజ్ మోడ‌ల్ నానో బ‌నానా లైట్ 2ను విడుద‌ల చేసింది. ఇది అత్యంత త‌క్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంగా ప‌నిచేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది. డెవ‌ల‌ప‌ర్ల కోసం జెమిని ఓమ్ని ఫ్లాష్ అనే మోడ‌ల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపింది.

S

Technology | Published On Jul 1, 2026, 12.03 pm IST

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడ‌ల్‌.. 4 సెక‌న్ల‌లో ఏఐ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది..
Advertisement

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఏఐ ఇమేజ్ మోడ‌ల్ నానో బ‌నానా లైట్ 2ను విడుద‌ల చేసింది. ఇది అత్యంత త‌క్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంగా ప‌నిచేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది. డెవ‌ల‌ప‌ర్ల కోసం జెమిని ఓమ్ని ఫ్లాష్ అనే మోడ‌ల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపింది. ఈ రెండు మోడ‌ల్స్‌ను యూజ‌ర్లు ఇమేజ్‌, వీడియో జ‌న‌రేష‌న్‌, వీడియో ఎడిటింగ్‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. గ‌త మోడ‌ల్స్ క‌న్నా ఇవి త‌క్కువ ఖ‌ర్చుతో ప‌నిచేస్తాయ‌ని, ఎక్కువ వేగంగా అవుట్ పుట్‌ను ఇస్తాయ‌ని గూగుల్ తెలిపింది. డెవ‌ల‌ప‌ర్లు భారీ స్థాయిలో ఇమేజ్ ల‌ను క్రియేట్ చేయ‌డం, మ‌ల్టీ ట‌ర్న్ వీడియో ఎడిటింగ్‌, మ‌ల్టీ మోడ‌ల్ కంటెంట్ క్రియేష‌న్ త‌దిత‌ర ప‌నుల కోసంఈ మోడ‌ల్స్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఇమేజ్‌లు, వీడియోలు మొత్తం కంటెంట్ క్రియేష‌న్ ప్ర‌క్రియ గ‌తంలో క‌న్నా మ‌రింత వేగంగా పూర్త‌వుతుంది.

4 సెక‌న్ల‌లోనే ఇమేజ్ క్రియేష‌న్‌..

నానో బ‌నానా 2 లైట్ ఇమేజ్ మోడ‌ల్ జెమిని 3.1 ప్లాష్ లైట్ ఇమేజ్ ఆధారంగా ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం నానో బ‌నానా ఇమేజ్ మోడ‌ల్ ఉండ‌గా ఇది జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఆధారంగా ప‌నిచేస్తుంది. అయితే కొత్త మోడ‌ల్ వేగంగా ప‌నిచేస్తుంద‌ని, త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని, అందువ‌ల్ల యూజ‌ర్లు కొత్త మోడ‌ల్‌ను ఉపయోగించాల‌ని గూగుల్ సూచించింది. కొత్త వెర్ష‌న్‌లో మెరుగైన ఇమేజ్ క్వాలిటీ, అధిక వేగం, త‌క్కువ ఆప‌రేటింగ్ ఖ‌ర్చులు ఉంటాయ‌ని వెల్లడించింది. ఈ మోడ‌ల్ ఫీచ‌ర్ల‌లో భాగంగా సుమారు 4 సెక‌న్ల‌లోనే టెక్ట్స్ నుంచి ఇమేజ్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ప్ర‌తి వేయి రిజ‌ల్యూష‌న్ ఇమేజ్‌కు 0.034 డాల‌ర్లే ఖ‌ర్చ‌వుతుంది. దీంతోపాటు వేగవంతమైన విజువల్ డ్రాఫ్టింగ్, భారీ స్థాయిలో ఇమేజ్ జనరేషన్, ప్రాంప్ట్‌ను క‌చ్చితంగా అనుసరించడం, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, ఇమేజ్‌లో స్పష్టంగా చదవగలిగే టెక్స్ట్ రెండరింగ్ ఉంటాయి.

ఏయే మోడ‌ల్స్ ఉన్నాయి..

గూగుల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న జెమినీ ఇమేజ్ మోడళ్ల వివరాలను కూడా వెల్లడించింది. నానో బనానా 2 లైట్ (జెమిని 3.1 ఫ్లాష్ లైట్ ఇమేజ్) అత్యల్ప లేటెన్సీతో భారీ స్థాయి వర్క్‌ఫ్లోల కోసం ప‌నిచేస్తుంది. నానో బనానా 2 (జెమిని 3.1 ఫ్లాష్ ఇమేజ్) ఇమేజ్ నాణ్యత, వేగం, ఖర్చు మధ్య సమతుల్యత కలిగిన సాధారణ ఉపయోగాల మోడల్‌గా ఉంది. నానో బనానా ప్రో (జెమిని 3 ప్రో ఇమేజ్) ప్రొఫెషనల్ వర్క్‌ఫ్లోలు, అధునాతన నియంత్రణ, మెరుగైన రీజనింగ్ కోసం ప‌నిచేస్తుంది. పాత తరం నానో బనానా (జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్) స్థానంలో ఇప్పుడు నానో బనానా 2 లైట్‌ను ఉపయోగించాలని గూగుల్ సూచిస్తోంది.

అందుబాటులోకి వ‌చ్చిందా..?

నానో బనానా 2 లైట్ బుధ‌వారం నుంచే గూగుల్ ఏఐ స్టూడియో, జెమిని ఏపీఐ, జెమిని ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. అలాగే సెర్చ్‌లోని ఏఐ మోడ్, జెమిని యాప్, నోట్‌బుక్‌ఎల్‌ఎమ్, గూగుల్ ఫొటోస్, స్టిచ్, గూగుల్ ఫ్లో, గూగుల్ యాడ్స్‌లకు కూడా దశలవారీగా అందుబాటులోకి వ‌స్తోంది. జెమిని ఓమ్ని ఫ్లాష్ ప్రస్తుతం గూగుల్ ఏఐ స్టూడియో, జెమిని ఏపీఐ, జెమిని ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్, జెమిని యాప్, గూగుల్ ఫ్లోలో పబ్లిక్ ప్రివ్యూ రూపంలో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడళ్ల కోసం గూగుల్ ఏఐ స్టూడియో ప్లేగ్రౌండ్ యాక్సెస్, జెమిని ఏపీఐ డాక్యుమెంటేషన్, ప్రాంప్టింగ్ గైడ్‌లు, ఉదాహరణ వర్క్‌ఫ్లోలను కూడా డెవలపర్లకు విడుదల చేసింది.

Advertisement
Advertisement