Ram Yantra | అయోధ్యలో మరో అద్భుత ఘట్టం.. శ్రీరామ యంత్రం ప్రతిష్ట.. దీని ప్రత్యేకతేంటంటే..?
Ram Yantra | అయోధ్య రామ మందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 150 కిలోల బరువున్న బంగారు పూత పూసిన అత్యంత పవిత్రమైన 'శ్రీరామ యంత్రం' (Ram Yantra) ఫలకాన్ని ప్రతిష్టించారు.
Ram Yantra | అయోధ్య రామ మందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 150 కిలోల బరువున్న బంగారు పూత పూసిన అత్యంత పవిత్రమైన 'శ్రీరామ యంత్రం' (Ram Yantra) ఫలకాన్ని ప్రతిష్టించారు. కంచి కామకోటి (Kanchi Kamakoti Peetam) పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో కంచి పీఠంలోని పురాతన రామ యంత్రం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ పవిత్ర రామ్ యంత్రాన్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ట్రస్ట్ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రెండో అంతస్తులోని గర్భగుడిలో ఉంచారు.
ఈ రామ యంత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ కొత్త యంత్రం ఉపనిషత్ మఠంలో శాలగ్రామ శిలతో రూపొందించారు. ఇందులో దేవనాగరి లిపిలో మంత్రాలు ఉన్నాయి. విష్ణువు యొక్క వివిధ అంశాలు, అవతారాలను ప్రతిబింబించే ఎంపిక చేసిన మంత్రాలు ఇందులో ఉన్నాయి. దీనిపై పవిత్రమైన 'బీజ మంత్రాలు' అద్భుతంగా చెక్కారు. దీని కేంద్రభాగంలో సీతాదేవి బీజాక్షరంతో కూడిన శ్రీరామ మంత్రం కొలువై ఉంది.
కంచిలోని ఓ మఠంలో తయారు చేసిన ఈ యంత్రాన్ని తొలుత తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక రథంలో అయోధ్యకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రత్యేక రథం ఐదు రాష్ట్రాల మీదుగా 45 రోజుల పాటు 2,000 కి.మీ ప్రయాణించి అయోధ్యకు చేరుకుంది. రామ మందిరంలోని గర్భగుడిలో, ప్రధాన విగ్రహానికి సమీపంలో ఈ యంత్రాన్ని ప్రతిష్టించారు. ఈ యంత్ర ప్రతిష్టతో అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు దాదాపు పూర్తైనట్లే.
Also Read..
ఖరీదైన గ్యాడ్జెట్లు కాదు.. పిల్లలకు సమయాన్ని కానుకగా ఇవ్వండి: సీపీ సజ్జనార్
టోల్‌ప్లాజాలా వద్ద "నో క్యాష్".. ఇకపై మొత్తం డిజిటల్ ప్రయాణమే.. ఎప్పటి నుంచంటే..?
కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఆలోచన కేసీఆర్‌దే: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
సంబంధిత వార్తలు

Ram Mandir Construction | జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
జులై 11, 2026

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
జులై 8, 2026

Uddhav Thackeray | విరాళాల చోరీపై “రామ రక్ష” నిరసనలకు పిలుపునిచ్చిన శివసేన
జులై 3, 2026
తాజావార్తలు
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్
- ●Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?
- ●Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్
- ●OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..
- ●Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు

KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే

Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?

Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్



