Delhi Fire | భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!
Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనక్‌పురి (Janakpuri) ప్రాంతంలో ఉన్న విజయ్ సేల్స్ షోరూమ్‌లో (Vijay Sales showroom) మంటలు చెలరేగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.
Delhi Fire | దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదాలు (Delhi Fire) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ బహుళ అంతస్తుల ఎలక్ట్రానిక్స్ షోరూమ్ (electronics showroom)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
జనక్‌పురి (Janakpuri) ప్రాంతంలోని ఉత్తమ్ నగర్-నజాఫ్‌గఢ్ రోడ్డులోని విజయ్ సేల్స్ షోరూమ్‌లో (Vijay Sales showroom) బుధవారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కాసేపటికే మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. పక్కనే ఉన్న బాటా షోరూమ్‌కు (Bata showroom) కూడా అంటుకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది (Delhi Fire Service) 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 4:15 గంటలకు మంటలు చెలరేగగా ఉదయం 6:30 గంటలకు అదుపులోకి వచ్చాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
రూ.లక్షల్లో నష్టం
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 350 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలోని బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, పై మూడు అంతస్తుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నష్టం రూ.లక్షల్లో ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
సంబంధిత వార్తలు

Delhi Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 25 ఫైర్‌ఇంజిన్లతో అదుపులోకి..
జూన్ 24, 2026

Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ
జూన్ 5, 2026

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే ‘సేఫ్టీ నెట్’గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?



