LPG Cylinders | ఎల్పీజీ సిలిండర్లను కబోర్డ్స్‌లో ఉంచుతున్నారా..? వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు మస్ట్
LPG Cylinders | వేసవి కాలం ఎల్పీజీ సిలిండర్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పైపులు, రెగ్యులేటర్లు, వాల్వ్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ. సిలిండర్లను ఎండ తగలని, గాలి, వెలుతురూ ఉండే ప్రదేశాల్లో ఉంచాలి.
LPG Cylinders | దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా (Extreme Heat) పెరుగుతున్నాయి. అదే సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అగ్నిమాపక శాఖ అధికారులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్ల (LPG Cylinders)తో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు అవి పేలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, గాలి, వెలుతురు సరిగ్గా లేని చోట ఉంచడం వల్ల గ్యాస్ లీకేజీలు, మంటలు వ్యాపించడం, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎల్పీజీ సిలిండర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు మస్ట్
- సిలిండర్లను నేరుగా ఎండ తగిలే, వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు. చల్లగా ఉండే, గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి. సిలిండర్లను బాల్కనీల్లో ఉంచడం మంచిది. అయితే, అక్కడ వేడిని విడుదల చేసే పరికరాలు అస్సలు ఉండకూడదు.
- సిలిండర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. పైపులు, రెగ్యులేటర్లు, వాల్వ్స్‌లో లీకేజీలు వంటివి ఉన్నాయోమో చెక్ చేస్తూ ఉండాలి. తీవ్రమైన వేడి వల్ల రబ్బరు ట్యూబ్‌లు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. పైపు, రెగ్యులేటర్ వద్ద సోప్ వాటర్ వేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ బుడగలు వస్తే అక్కడ లీకేజీ ఉందని అర్థం. పగుళ్లు ఉన్నా లేదా అరిగిపోయినా ఆ పైపులను వెంటనే మార్చుకోవడం బెటర్.
- ఇంట్లో గ్యాస్ స్మెల్ వస్తోందని అనిపించిన వెంటనే అప్రమత్తం కండి. ముందుగా రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి డోర్లు, కిటికీలను తెరిచి ఉండండి. ఆ సమయంలో పొరపాటున కూడా లైట్లు వేయకూడదు.
- స్టవ్స్, ఎలక్ట్రికల్ పాయింట్లకు సిలిండర్లను దూరంగా ఉంచాలి. సిలిండర్ల దగ్గర పెట్రోల్ వంటి మండే స్వభావం గల వస్తువులను నిల్వ చేయకూడదు.
- కొందరు ఇళ్లలో కబోర్డ్‌లో సిలిండర్‌ను పెడుతుంటారు. అలా అస్సలు చేయకూడదు. దీనివల్ల పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువ.
- వంట పని పూర్తైన తర్వాత రెగ్యులేటర్‌ను తప్పకుండా కట్టేయాలి. కొందరు అలానే వదిలేస్తుంటారు. బర్నర్‌ను మాత్రమే కట్టేసి కింద రెగ్యులేటర్‌ను ఆపరు. ఇలా చేయడం వల్ల పైపుల్లో గ్యాస్ నిలిచిపోతుంది. అది కూడా ప్రమాదమే. రోజూ రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలి.
- పిల్లల్ని ఎల్పీజీ సిలిండర్లకు దూరంగా ఉంచాలి.
Also Read..
'ఓం' కేవలం ఒక శబ్దం కాదు.. అందులో దాగిన అద్భుతమైన రహస్యం ఇదే!
యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
జాబ్ చేస్తున్నా సరే.. SIPలో ఇలా చేస్తే రిటైర్మెంట్ వయస్సుకు చేతిలో కోట్లు ఉంటాయి..
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి
- ●Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
- ●Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
- ●Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి
- ●Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
- ●Vakiti Srihari | క్రీడల్లో ఎందుకు వెనకబడ్డమో యువత ఆలోచించాలి

Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి

Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్

Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!

Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి






