త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | అర్ధరాత్రి 40 మంది పోకిరీలకు సుమతీ దండకం…

CP Sumathi | మ‌ల్కాజిగిరి సీపీ సుమతి (CP Sumathi) త‌న మార్క్ చూపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వ‌హించారు.

G

Hyderabad | Published On May 6, 2026, 1.23 pm IST

CP Sumathi | అర్ధరాత్రి 40 మంది పోకిరీలకు సుమతీ దండకం…
Advertisement

CP Sumathi | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ల్కాజిగిరి సీపీ సుమతి (CP Sumathi) త‌న మార్క్ చూపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా సాధార‌ణ మ‌హిళ‌లా అర్ధరాత్రి రోడ్డుపై సీపీ సుమ‌తి నిల్చున్నారు. ఆమెను చుట్టుమట్టిన పోకిరీలు.. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. ఆప‌రేష‌న్‌లో భాగంగా 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులే కావ‌డం గ‌మ‌నార్హం. కాగా, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీపీ సుమ‌తి నిర్వ‌హించిన ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది.

సాధార‌ణ మ‌హిళ‌లా బ‌స్టాండ్‌లో..

మంగ‌ళ‌వారం అర్ధరాత్రి సీపీ సుమతి ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళలా దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌కు వెళ్లారు. బస్సు కోసం వేచిచూస్తున్నట్టుగా ఉంటూనే అక్కడి పరిస్థితులను గమనించారు. ఆమె పోలీస్ కమిషనర్ అని తెలియక కొందరు యువకులు, పోకిరీలు ఆమెను వేధించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమెను సుమారు 40 మంది యువ‌కులు వేధించిన‌ట్లు స‌మాచారం

దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడంతోపాటు, మహిళలను వేధించే యువకులపై నిఘా పెట్టడం, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ఆప‌రేష‌న్ అనంత‌రం 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Advertisement
Advertisement