త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | నా గోల్ 100.. ప్ర‌తీ ఎఫ్ఐఆర్‌ను మెడ‌ల్‌గా భావిస్తా : రాహుల్ గాంధీ

Rahul Gandhi | ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ల (FIR) ప‌ట్ల త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌న్నారు. త‌న‌పై ఇప్ప‌టికే 45 ఎఫ్ఐఆర్‌లు న‌మోదైన‌ట్లు చెప్పారు. త‌న గోల్ 100 అని పేర్కొన్నారు. ప్ర‌తీ ఎఫ్ఐఆర్‌ను తాను ఓ ప‌త‌కంలా భావిస్తానంటూ వ్యాఖ్యానించారు.

D

National | Published On Oct 7, 2026, 4.36 pm IST

Rahul Gandhi | నా గోల్ 100.. ప్ర‌తీ ఎఫ్ఐఆర్‌ను మెడ‌ల్‌గా భావిస్తా : రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి హైడ్రామా చోటు చేసుకుంది. ఇవాళ మ‌ధ్యాహ్నం విప‌క్ష ఇండీ కూట‌మి ఎంపీలంతా సెంట్ర‌ల్ ఢిల్లీలోని జనపథ్‌లో గ‌ల‌ సాగర్ రత్న రెస్టారెంట్‌లో భేటీ అయ్యారు. లంచ్ త‌ర్వాత వారంతా త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించేందుకు జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వైపు క‌దిలారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని మార్గం మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు.

జంత‌ర్ మంత‌ర్‌కు బ‌య‌ల్దేరిన విప‌క్ష ఎంపీలు

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఓట్ల చోరీ అంశంపై ఆందోళనలను ఉధృతం చేసేందుకు విపక్ష ఇండీ (INDIA) కూటమి పావులు కదుపుతోంది. నిన్న ఢిల్లీలో విప‌క్ష ఎంపీలంతా మార్చ్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇవాళ మ‌ధ్యాహ్నం ఎంపీలంద‌రికీ కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే లంచ్ ఇచ్చారు. ఈ స‌మావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించి, భవిష్యత్ ప్రణాళికను ఖ‌రారు చేశారు. ఈ లంచ్ భేటీ అనంత‌రం ఎంపీలంతా త‌మ నిర‌స‌న‌ను కొన‌సాగించేందుకు జంత‌ర్ మంత‌ర్ వైపు బ‌య‌ల్దేరారు. అయితే, అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు జంతర్ మంతర్‌కు వెళ్లే అన్ని మార్గాలను భారీ బారికేడ్లతో దిగ్బంధించారు. ఎంపీలు ప్ర‌యాణిస్తున్న బ‌స్సును మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు.

ఎంపీల‌ను సీఈసీ ఎందుకు క‌ల‌వ‌డం లేదు..?

పోలీసుల తీరుపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుమారు 300 మంది ఎంపీలు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలవాలనుకున్నారని చెప్పారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నార‌ని ఆరోపించారు. ఎంపీలను సీఈసీ ఎందుకు కలవడం లేదని రాహుల్ ప్రశ్నించారు. ఎన్నిక‌ల సంఘం ఆఫీస్ వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెబుతున్నార‌ని.. అందుకు ఈరోజు నిర‌స‌న తెలిపేందుకు జంత‌ర్ మంత‌ర్‌కు వెళ్తున్న‌ట్లు చెప్పారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, జ్ఞానేశ్ కుమార్ దేశ ప్ర‌జాస్వామ్యాన్ని నాశ‌నం చేశార‌ని రాహుల్ ఆరోపించారు.

నా గోల్ 100..

ఈ సంద‌ర్భంగా రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ల (FIR) ప‌ట్ల త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌న్నారు. ఇప్ప‌టికే 45 ఎఫ్ఐఆర్‌లు న‌మోదైన‌ట్లు చెప్పారు. త‌న గోల్ 100 అని పేర్కొన్నారు. ప్ర‌తీ ఎఫ్ఐఆర్‌ను తాను ఓ ప‌త‌కంలా (FIRs are like medals) భావిస్తానంటూ వ్యాఖ్యానించారు.

రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

కాగా, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై ఎఫ్ఐఆర్ న‌మోదైన విష‌యం తెలిసిందే. సీఈసీకి వ్య‌తిరేకంగా నిన్న ఢిల్లీలో ఇండీ కూట‌మి నిర‌స‌న‌ల సంద‌ర్భంగా ఎలాంటి అనుమ‌తి లేకుండా ఆకాశ‌వాణి కార్యాల‌యంలోకి (Akashvani Bhawan) బ‌ల‌వంతంగా ప్ర‌వేశించార‌న్న ఆరోప‌ణ‌లపై అందిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు. రాహుల్‌, ప్రియాంక‌తోపాటూ ప‌లువురు ఎంపీల‌పై కూడా కేసులు బుక్ చేశారు.

Also Read..

రసాయన శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంపు..

Advertisement
Advertisement