Bharti Airtel | వినియోగదారులకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు..
Bharti Airtel | భారతి ఎయిర్‌టెల్ తన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై నెలకు రూ.50 చొప్పున టారిఫ్‌ను పెంచింది. అక్టోబర్ 8 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రీమియం కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం, అంటే ఏఆర్‌పీయూ, పెంచుకోవడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ మార్పులు చేసింది.
Bharti Airtel | భారతి ఎయిర్‌టెల్ తన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై నెలకు రూ.50 చొప్పున టారిఫ్‌ను పెంచింది. అక్టోబర్ 8 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రీమియం కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం, అంటే ఏఆర్‌పీయూ, పెంచుకోవడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ మార్పులు చేసింది. కొత్త ప్లాన్లలో అర్హత ఉన్న వినియోగదారులకు ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. కొత్త ఆఫర్ ప్రకారం ప్రతి పోస్ట్‌పెయిడ్ సిమ్‌కు ఏడాదికి ఒక ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ట్రిప్ లభిస్తుంది. ఐదు రోజుల రోమింగ్ ప్యాక్‌లో 5 జీబీ డేటా, 60 నిమిషాల వాయిస్ కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌లకు ఉచిత సదుపాయం ఉంటాయి. ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఖాతాతో అనుసంధానమైన ప్రతి సిమ్‌కు ఈ ప్రయోజనాన్ని విడివిడిగా పొందే అవకాశం ఉంటుంది.
కంపెనీకి పెరగనున్న ఆదాయం..
పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో మరికొన్ని ప్రీమియం సదుపాయాలను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఇందులో 5జి ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, స్పామ్, మోసపూరిత లింకుల నుంచి నెట్‌వర్క్ స్థాయి రక్షణ, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ అడ్వాంటేజ్ క్లబ్ ద్వారా వినోద ప్రయోజనాలు ఉన్నాయి. ప్రీమియమైజేషన్ వ్యూహంలో భాగంగా ఎయిర్‌టెల్ తన టారిఫ్ నిర్మాణాన్ని మార్చింది. ఎక్కువ విలువ కలిగిన ప్లాన్లకు కస్టమర్లను అప్‌గ్రేడ్ చేయించేలా ఈ మార్పులు చేసింది. తద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం పెరగనుంది. ప్లాన్ ఆప్షన్లను పునర్వ్యవస్థీకరించడం ద్వారా నెలవారీ ఏఆర్‌పీయూ రూ.4 నుంచి రూ.12 వరకు పెరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌టెల్ భారత విభాగం ఏఆర్‌పీయూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2027 తొలి త్రైమాసికంలో రూ.264గా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో అది రూ.250గా నమోదైంది.
పెరిగిన షేర్లు..
ఈ ప్రకటన తర్వాత బుధవారం భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2 శాతానికి పైగా పెరిగి రూ.1,843.50 వద్ద ట్రేడయ్యాయి. అక్టోబర్ 8 నుంచి ప్రస్తుత కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు నేరుగా అప్‌గ్రేడ్ కావచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్లు కానివారు కూడా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా స్థానిక స్టోర్ ద్వారా కొత్త పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
సెప్టెంబర్ 22, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
సెప్టెంబర్ 1, 2026

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
- ●UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్
- ●Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
- ●vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
- ●Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..

Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు

UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్

Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..



