త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nobel Prize 2026 | రసాయన శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌

Nobel Prize 2026 | రసాయన శాస్త్రం (Chemistry)లో ఇద్ద‌రు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize) వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి.క‌గాన్‌, జ‌పాన్‌కు చెందిన కెన్సో సొసాయ్‌లను ఈ పుర‌స్కారానికి ఎంపిక‌య్యారు.

D

International | Published On Oct 7, 2026, 3.50 pm IST

Nobel Prize 2026 | రసాయన శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌
Advertisement

Nobel Prize 2026 | త్రినేత్ర న్యూస్ : రసాయన శాస్త్రం (Chemistry)లో ఇద్ద‌రు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize) వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి.క‌గాన్ (Henri B. Kagan), జ‌పాన్‌కు చెందిన కెన్సో సొసాయ్ (Kenso Soai)లను ఈ పుర‌స్కారానికి ఎంపిక చేసిన‌ట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధ‌వారం ప్ర‌క‌టించింది. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథ‌సిస్‌లో (asymmetric organic synthesis) నాన్-లీనియర్ ప్రభావాలు (non-linear effects), ఆటోకటాలిసిస్ (autocatalysis) ఆవిష్కరణలు చేసినందుకు గాను వీరికి ఈ పురస్కారం దక్కింది.

హెన్రీ బి. కగన్ ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత 'యూనివర్శిటీ పారిస్- సుద్'లో పలు పరిశోధనలు చేశారు. కెన్సో సొసాయ్ జపాన్‌లోని టోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్సెస్‌లో సేవలందిస్తున్నారు. ఆధునిక రసాయన శాస్త్రంలో ముఖ్యంగా ఔషధ తయారీ రంగంలో వీరు కీలక పరిశోధనలు చేసిన‌ట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. కాగా గ‌తేడాది ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు ర‌సాయ‌న నోబెల్ ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఇక‌ ర‌సాయ‌న శాస్త్రంలో 1901 నుంచి 2025 వ‌ర‌కు 117 సార్లు నోబెల్ అవార్డులు ప్ర‌క‌టించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 198 మంది అవార్డు అందుకున్నారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 5వ తేదీన అవార్డుల ప్ర‌క‌ట‌న ప్రారంభ‌మైంది. మొద‌టి రోజు వైద్య శాస్త్రంలో, రెండోరోజు ఫిజిక్స్ శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ప్ర‌క‌టించారు. మూడోరోజైన ఇవాళ కెమిస్ట్రీ కేట‌గిరీలో అవార్డును ప్ర‌క‌టించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయ‌న‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. అవార్డు గ్రహీతలకు 12 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందుతుంది.

Also Read..

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రెండు డీఏలు మంజూరు

అరగుంట అక్రమం అని తేలినా ముక్కు నేలకు రాస్తా

Advertisement
Advertisement