త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్‌

Rahul Gandhi | దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఒకే వేదిక‌పైకి తెచ్చేందుకు, వాటికి మద్దతు కూడగట్టే లక్ష్యంతో 'సత్యాగ్రహ' పేరుతో ప్ర‌త్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను (Satyagraha website) ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ప్రారంభించారు.

D

National | Published On Oct 3, 2026, 1.42 pm IST

Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : నీట్ పేప‌ర్ లీక్‌, స‌ర్ ప్ర‌క్రియ‌, ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం, మహిళల హక్కులు, రైతుల సమస్యలు, ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు వంటి అంశాల‌పై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఒకే వేదిక‌పైకి తెచ్చేందుకు శ్రీ‌రాకం చుట్టారు. ఈ ఉద్య‌మాల‌న్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి, వాటికి మద్దతు కూడగట్టే లక్ష్యంతో 'సత్యాగ్రహ' పేరుతో ప్ర‌త్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను (Satyagraha website) శనివారం ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించడం ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత అని రాహుల్ స్ప‌ష్టం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాల స్ఫూర్తితో అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల స్వరాన్ని బలోపేతం చేసేందుకు ఈ డిజిటల్ వేదికను తీసుకువచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న ప్రజలు తమ ఉద్యమాలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా, ఇంటరాక్టివ్ మ్యాప్ సాయంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి పోరాటాలను కనుగొని ప్రత్యక్ష మద్దతు కోరేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంత‌గానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

"దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. చాలాసార్లు ఒంటరిగానే పోరాటం చేయాల్సి వస్తోంది. జెన్-జీ (Gen Z), విద్యార్థులు, రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు.. ఇలా ప్రతి పోరాటానికి ఒక‌ కథ ఉంది. కానీ ఒంటరిగా వినిపించే స్వరం తరచుగా అణచివేయబడుతోంది. అందుకే ఈ గొంతులన్నింటినీ ఒకే వేదిక‌పైకి తీసుకువచ్చే ప్రయత్నమే 'సత్యాగ్రహ'. సత్యమే అత్యంత శక్తివంతమైన ఆయుధమని బాపు మనకు బోధించారు. సత్యం వైపు నిల‌బ‌డి ఐక్యతను చాటడం అంతకంటే గొప్ప ఆయుధం. మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీ పోరాటాన్ని ఈ వేదిక‌గా పంచుకోండి" అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా వెన్నెంటే ఉంటూ త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయా స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read..

వినియోగ‌దారుల‌కు షాక్‌.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెంపు

డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు చారిత్మాత‌క విజ‌యం.. న‌వ‌ప్రీత్ సింగ్ భార‌త్‌కు డిపోర్ట్‌

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ డీల్స్ రివీల్‌.. ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్‌..

Advertisement
Advertisement