త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు చారిత్మాత‌క విజ‌యం.. న‌వ‌ప్రీత్ సింగ్ భార‌త్‌కు డిపోర్ట్‌

Amit Shah | అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కింగ్‌పిన్ (narco trafficking kingpin) న‌వ్‌ప్రీత్ సింగ్ (Navpreet Singh)ను తుర్కియే నుంచి భార‌త్‌కు విజ‌య‌వంతంగా డిపోర్ట్ చేసిన‌ట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్ర‌క‌టించారు.

D

National | Published On Oct 3, 2026, 12.13 pm IST

Amit Shah | డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు చారిత్మాత‌క విజ‌యం.. న‌వ‌ప్రీత్ సింగ్ భార‌త్‌కు డిపోర్ట్‌
Advertisement

Amit Shah | త్రినేత్ర న్యూస్ : మ‌త్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించాయి. అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కింగ్‌పిన్ (narco trafficking kingpin) న‌వ్‌ప్రీత్ సింగ్ (Navpreet Singh)ను తుర్కియే నుంచి భార‌త్‌కు విజ‌య‌వంతంగా డిపోర్ట్ చేసిన‌ట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్ర‌క‌టించారు. ఇది మోదీ సర్కార్ సాధించిన గొప్ప విజయంగా ఆయ‌న అభివర్ణించారు.

న‌వ్‌ప్రీత్ సింగ్.. న‌వాబ్ విర్క్ అనే న‌కిలీ పేరుతో తుర్కియే (Turkiye) పౌరసత్వాన్ని పొందాడు. ఆఫ్ఘానిస్థాన్ నుంచి భార‌త్‌కు పెద్ద ఎత్తున హెరాయిన్​, మెథాంఫేటమైన్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌త్తుప‌దార్థాల‌ను స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. అత‌డి క‌ద‌లిక‌ల‌ను భార‌త్ నిఘా వ‌ర్గాలు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాయి. అత‌డి అస‌లు గుర్తింపును బ‌ట్ట‌బ‌య‌లు చేసి తుర్కియే అధికారుల సాయంతో న‌వ్‌ప్రీత్‌ను భార‌త్‌కు డిపోర్ట్ చేశాయి. ప్రస్తుతం నిందితుడిని దేశానికి తీసుకువచ్చి జైలులో ఉంచారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అత‌న్ని విజ‌య‌వంతంగా భార‌త్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఏజెన్సీలను షా ఈ సంద‌ర్భంగా అభినందించారు.

కాగా, అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్లపై ఉక్కుపాదం మోపేందుకు హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగానే విదేశాల్లో ఉన్న భారతీయ డ్రగ్స్ నేరస్థులను పట్టుకోవడానికి 'ఆపరేషన్ గ్లోబల్-హంట్' (Operation Global-Hunt) పేరిట ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా ఇటీవలే తుర్కియే నుంచి మొహమ్మద్ సలీమ్ డోలా, యూఏఈ నుంచి వీరేంద్ర సింగ్ బిసోయా, మలేషియా నుంచి నవీన్ చిచ్కర్ వంటి ప్రధాన డ్రగ్ నెట్‌వర్క్ లీడర్లను భారత్‌కు రప్పించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌రో చారిత్రాత్మ‌క విజ‌యం ద‌క్కిన‌ట్లైంది.

Also Read..

దారుణం.. పబ్‌లో మహిళను వివ‌స్త్ర‌ను చేసి దాడి

లాంగ్ వీకెండ్‌.. మ‌నాలీకి క్యూ క‌ట్టిన ప‌ర్యాట‌కులు.. భారీగా ట్రాఫిక్ జామ్‌

ఉగ్ర‌వాద భావ‌జాలం.. విమానాలు న‌డ‌ప‌డంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైల‌ట్ గురించి సంచ‌ల‌న విష‌యాలు

Advertisement
Advertisement