Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
Nayara Energy | దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ కస్టమర్లకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచింది (petrol and diesel prices up).
Nayara Energy | త్రినేత్ర న్యూస్ : దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ కస్టమర్లకు షాకిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచింది (petrol and diesel prices up). లీటరు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా రిటైలర్లపై పడిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా రిఫైనరీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎనర్జీ ధరలు మళ్లీ పుంజుకోవడంతో ఇంధన రిటైలర్లపై తీవ్ర భారం పడుతోంది. దీనిని అధిగమించడానికి నయారా సంస్థ ధరలను సర్దుబాటు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో కూడా నయారా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. అప్పుడు కూడా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపు ప్రకటించింది. ఆ తర్వాత జులైలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, కీలకమైన సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడంతో ఇంధన ధరలను తగ్గించింది. ఇప్పుడు మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నయారా సంస్థ దేశవ్యాప్తంగా 7,000కు పైగా రిటైల్ ఔట్‌లెట్ల (Nayara Retail Oulets)ను నిర్వహిస్తోంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. సంస్థ నిర్ణయం ప్రైవేట్ రంగ ఇంధన రిటైల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ముడి చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read..
దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి
మీ సాహసం.. ప్రతి భారతీయుడికీ గర్వకారణం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై చిరంజీవి ప్రశంసలు
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
- ●Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..
- ●Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్
- ●Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..
- ●Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్

Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం

Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..

Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?






