Anti Paper Leak Bill | రాజ్యసభ ముందుకు పేపర్ లీక్ బిల్లు
Anti Paper Leak Bill | లోక్‌సభ ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు (Anti Paper Leak Bill) ఇవాళ రాజ్యసభ (Rajya Sabha) ముందుకు వెళ్లింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఎగువ సభలో ప్రవేశపెట్టారు.
Anti Paper Leak Bill | త్రినేత్ర.న్యూస్ : లోక్‌సభ ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు (Anti Paper Leak Bill) ఇవాళ రాజ్యసభ (Rajya Sabha) ముందుకు వెళ్లింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఎగువ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చకు ఏడు గంటల సమయం కేటాయించినట్లు చెప్పారు. సభ్యులంతా చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014 తర్వాత ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ ఘటనలను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 2024 వరకూ ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ కట్టడికి సంబంధించి ఎలాంటి చట్టం లేదని గుర్తు చేశారు.
ఇదీ చదవండి : పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ప్రతిపక్షాలకు ఎలాంటి అజెండా లేదు.. నడ్డా
ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభాకార్యకలాపాలు ముందుకు సాగకుండా విపక్ష ఎంపీలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అజెండా లేదని, పదే పదే డిమాండ్లను మారుస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని, సభను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపక్షం మాత్రం చర్చల నుంచి పారిపోతోందని దుయ్యబట్టారు. ఎగువ సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కూడా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నడ్డా స్పష్టం చేశారు.
Also Read..
తప్పు చేయకపోతే భయమెందుకు..? అమిత్ షాను టార్గెట్ చేసిన రాహుల్
సీజేపీ వార్నింగ్.. జంతర్ మంతర్ వద్ద హై అలర్ట్
అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు : సుప్రీంకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం






