Jantar Mantar | సీజేపీ వార్నింగ్.. జంతర్ మంతర్ వద్ద హై అలర్ట్
Jantar Mantar | నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లన్నింటినీ ఎత్తివేయకపోతే తమ ఆందోళనలను మళ్లీ ప్రారంభిస్తామంటూ కాక్రోచ్ జనతాపార్టీ చేసిన తాజా హెచ్చరికలతో (CJPs fresh protest threats) ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద భద్రతను కట్టుదిట్టం (heavy security) చేశారు.
Jantar Mantar | త్రినేత్ర.న్యూస్ : జులై 20న జరిగిన ఆందోళనల సందర్భంగా నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లన్నింటినీ ఎత్తివేయకపోతే తమ ఆందోళనలను మళ్లీ ప్రారంభిస్తామంటూ కాక్రోచ్ జనతాపార్టీ చేసిన తాజా హెచ్చరికలతో (CJPs fresh protest threats) ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద భద్రతను కట్టుదిట్టం (heavy security) చేశారు. అక్కడ అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇనుప బారికేడ్లను పెట్టారు.
నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలూ తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని కాక్రోచ్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మరోసారి ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు. నిరసనల సమయంలో ఆందోళనకారులు నిర్దేశిత ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా, బారికేడ్లను తొలగించకుండా ఉండేందుకు వాటికి ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేయించారు. ప్రస్తుతం అక్కడ భద్రత కొనసాగుతోంది.

Also Read..
అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు : సుప్రీంకోర్టు
షాకింగ్.. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు






