త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Justice Surya Kant | మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌.. లంచ్ టైమ్‌కి స‌మ‌స్య క్లియ‌ర్ కాక‌పోతే జోక్యం చేసుకుంటాన‌న్న సీజేఐ

CJI Justice Surya Kant | ఢిల్లీలో మెట్రో స్టేష‌న్లు మూత‌ప‌డ‌టంతో (Delhi Metro Stations Shut) ప‌లువురు న్యాయ‌వాదులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యం సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Justice Surya Kant) దృష్టికి వెళ్లింది. మ‌ధ్యాహ్న స‌మ‌యానికి స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే తానే స్వ‌యంగా జోక్యం చేసుకుంటాన‌ని సీజేఐ హామీ ఇచ్చారు.

D

National | Published On Jul 23, 2026, 12.40 pm IST

CJI Justice Surya Kant | మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌.. లంచ్ టైమ్‌కి స‌మ‌స్య క్లియ‌ర్ కాక‌పోతే జోక్యం చేసుకుంటాన‌న్న సీజేఐ
Advertisement

CJI Justice Surya Kant | కాక్రోచ్ జ‌న‌తాపార్టీ నిర‌స‌న‌ల‌తో (CJP Protests) భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఢిల్లీలోని ప్ర‌ధాన మెట్రో స్టేష‌న్లను అధికారులు మూసివేసిన (Delhi Metro Stations Shut) విష‌యం తెలిసిందే. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇక మూత‌ప‌డిన మెట్రో స్టేష‌న్ల‌లో సుప్రీంకోర్టు స్టేష‌న్ కూడా ఉంది. దీంతో న్యాయ‌వాదులు, సిబ్బంది స‌మ‌యానికి కోర్టు కార్య‌క‌లాపాల‌కు హాజ‌రుకావ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు (Supreme Court) ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ముందుకు వెళ్లింది.

మెట్రో స్టేష‌న్ క్లోజ్ చేయ‌డం వ‌ల్ల త‌లెత్తుతున్న ఇబ్బందుల‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ (Supreme Court Bar Association President Vikas Singh) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు స‌హా స‌మీపంలో ఉన్న అన్ని కీల‌క స్టేష‌న్లు మూసివేయ‌డం వ‌ల్ల చాలా మంది న్యాయ‌వాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ విష‌యంలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. చెల్లుబాటు అయ్యే ఎంట్రీ సాప్‌లు ఉన్న వ్య‌క్తుల‌ను, రిజిస్ట్రీ సిబ్బందిని త‌గిన భ‌ద్ర‌తా త‌నిఖీల త‌ర్వాత సుప్రీంకోర్టు మెట్రో స్టేష‌న్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అనుమ‌తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ అభ్య‌ర్థ‌న‌పై సీజేఐ సానుకూలంగా స్పందించారు. ఈ విష‌య‌మై మెట్రో అధికారుల‌తో మాట్లాడాల‌ని సుప్రీంకోర్టు ప‌రిపాల‌నా విభాగాన్ని ఇప్ప‌టికే ఆదేశించిన‌ట్లు చెప్పారు. మ‌ధ్యాహ్న స‌మ‌యానికి స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే తానే స్వ‌యంగా జోక్యం చేసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అదేవిధంగా న్యాయ‌వాదులు, సిబ్బంది కోర్టుకు హాజ‌రు కాక‌పోతే వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ద్దంటూ ఆదేశించిన‌ట్లు చెప్పారు.

16 మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌..

మ‌రోవైపు నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న‌లు (CJP protests) కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా గురువారం కూడా ఢిల్లీలో 16 మెట్రో స్టేష‌న్ల‌ను (Delhi Metro Stations Shut) అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌, రాజీవ్ చౌక్‌, ప‌టేల్ చౌక్‌, రామకృష్ణ ఆశ్రమం మార్గ్, బరాఖంభ రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థం, జనపథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ITO, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థం, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రోస్టేష‌న్ల‌న త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కూ మూసివేసిన‌ట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే, ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, మండి హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్ప‌ష్టం చేసింది. దీంతో ఆ మూడు మెట్రో స్టేషన్ల‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read..

పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆగ‌ని నిర‌స‌న‌లు.. ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

పోలీసుల‌పై రాళ్లు విసురుతున్న‌ది బీజేపీ గూండాలే.. అభిజీత్ దిప్కే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Advertisement
Advertisement