PM Modi | పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. ప్రధాని కీలక ప్రకటన
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను (Fast-track court) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
PM Modi | నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను (Fast-track court) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రధాని తెగేసి చెప్పారు. అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…
— Narendra Modi (@narendramodi) July 23, 2026
యువత భవిష్యత్తుకు హాని చేసిందే మీరు : రాహుల్
యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమంటూ ప్రధాని హెచ్చరికలపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. యువత భవిష్యత్తుకు హాని చేసిందే మీరు అంటూ ధ్వజమెత్తారు. దేశ విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదంటూ విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, జంతర్‌మంతర్‌లో ఆందోళన చేసిన విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
You are the one who has harmed the future of our youth the most.
You allowed and encouraged the total capture and destruction of our education system - and protected every person responsible for it.
The students’ demands are clear:
1. Sack Dharmendra Pradhan.
2. Apologise to… https://t.co/0MK4wPMNiK— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే : సీజేపీ
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని ప్రకటనపై కాక్రోచ్ పార్టీ స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టింది.
Dharmendra Pradhan Must Resign
धर्मेंद्र प्रधान को इस्तीफ़ा देना होगा https://t.co/0XShqJ6FVG
— Cockroach is Back (@Cockroachisback) July 23, 2026
16 మెట్రో స్టేషన్లు క్లోజ్..
మరోవైపు నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ పార్టీ ఆందోళనలు (CJP protests) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గురువారం కూడా ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను (Delhi Metro Stations Shut) అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమం మార్గ్, బరాఖంభ రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థం, జనపథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ITO, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థం, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రోస్టేషన్లన తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఆ మూడు మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Service Update
Below mentioned Metro stations will be closed from 07:30 AM till further instructions. However, Interchange facility shall remain available at Rajiv Chowk, Mandi House and Central Secretariat.
1. Lok Kalyan Marg
2. Rajiv Chowk
3. Patel Chowk
4. Ramakrishna…— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) July 23, 2026
Also Read..
బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
విద్యార్థులపై దాష్టికానికి వ్యతిరేకంగా.. ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన..
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






