త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anant Nag | అనంత్‌ నాగ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం

Anant Nag | ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలు, సుదీర్ఘ సినీ ప్రయాణానికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెల్లడించింది.

P

Entertainment | Published On Sep 16, 2026, 6.16 pm IST

Anant Nag | అనంత్‌ నాగ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
Advertisement

Anant Nag | ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలు, సుదీర్ఘ సినీ ప్రయాణానికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెల్లడించింది. అనంత్‌ నాగ్‌కు ఈ పురస్కారాన్ని 2026 సెప్టెంబర్‌ 22న గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అనంత్‌ నాగ్‌కు అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా తన సహజమైన నటన, విభిన్న పాత్రలు, అద్భుత ప్రతిభతో భారతీయ సినిమాపై ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ప్రధాని ప్రశంసించారు.

మాల్గుడి డేస్‌తో గుర్తింపు..

1948 సెప్టెంబర్‌ 4న అనంత్‌ నాగర్కట్టేగా జన్మించిన అనంత్‌ నాగ్‌.. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు 300కుపైగా సినిమాల్లో నటించారు. వీటిలో 250కుపైగా కన్నడ చిత్రాలే ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఇంగ్లిష్‌ భాషా చిత్రాల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ అనంత్‌ నాగ్‌ ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ రచయిత ఆర్‌కే నారాయ‌ణ్ కథల ఆధారంగా రూపొందిన దూరదర్శన్‌ సీరియల్‌ ‘మాల్గుడి డేస్‌’లో ఆయన నటించారు. ఈ సిరీస్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఐదు కర్ణాటక రాష్ట్ర అవార్డులు..

సుదీర్ఘ సినీ కెరీర్‌లో అనంత్‌ నాగ్‌ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ఐదుసార్లు దక్కించుకున్నారు. తాజాగా 2025లో భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది. భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. దేశ సినిమా అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి చేసిన వ్యక్తులకు అందజేస్తారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక గౌరవం అనంత్‌ నాగ్‌ను వరించడంతో కన్నడ సినీ పరిశ్రమ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

ప్రధాని మోదీ అభినందనలు

ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతీయ సినీ రంగానికి, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు అనంత్‌ నాగ్‌ చేసిన సేవలను ప్రశంసించారు. దశాబ్దాలుగా తన సహజమైన నటన, విభిన్న పాత్రలను పోషించే ప్రతిభతో ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారని మోదీ పేర్కొన్నారు. తాను పోషించిన ప్రతి పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. అనంత్‌ నాగ్‌కు దక్కిన ఈ గౌరవం ఎంతో సముచితమైనదని ప్రధాని అభిప్రాయపడ్డారు. “ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌ జీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు” అంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పురస్కారాన్ని 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Advertisement
Advertisement