త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Mine Collapse | కుప్ప‌కూలిన బంగారు గ‌ని.. 60 మంది మృతి

Gold Mine Collapse | సుడాన్ (Sudan)లో బంగారు గ‌ని కూలిపోయింది (Gold Mine Collapse). ఈ ఘ‌ట‌న‌లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

D

International | Published On Sep 16, 2026, 5.58 pm IST

Gold Mine Collapse | కుప్ప‌కూలిన బంగారు గ‌ని.. 60 మంది మృతి
Advertisement

Gold Mine Collapse | త్రినేత్ర‌.న్యూస్ : ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద‌క్షిణ ప్రాంతంలో బంగారు గ‌ని కూలిపోయింది (Gold Mine Collapse). ఈ ఘ‌ట‌న‌లో ప‌దుల సంఖ్య‌లో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

వెస్ట్ కొర్డోఫాన్ (West Kordofan) ప్రావిన్స్‌లో నుహుద్ (Nuhud) పట్టణ సమీపంలో ఉన్న అల్‌జారా బంగారు గని (Al-Zaraa mine) మంగ‌ళ‌వారం రాత్రి ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది శిథిలాల కింది చిక్కుకుపోయిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఇక ఈ ప్ర‌మాదం నుంచి ఇద్ద‌రు కార్మికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక్క‌డ‌ సొరంగాలు (Shafts) చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని.. ఒక‌టి కూలిపోతే గ‌ని మొత్తం కూలిపోతుంద‌ని వారు తెలిపారు. స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. బండరాళ్లు, మ‌ట్టిని తొల‌గించేందు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ప్రపంచంలోని అతి పేద దేశాల్లో సూడాన్‌ ఒకటి. ప్రస్తుతం సూడాన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆకలి, నిర్వాసితుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ జనాభాలో దాదాపు 2.5 కోట్ల మంది (సగానికి పైగా జనాభా) తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. దాదాపు 40 లక్షల మందికి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2023 ఏప్రిల్‌లో సూడాన్ సైన్యం (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య ప్రారంభమైన అంత‌ర్యుద్ధ‌మే ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణం. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు.

ఈ అంతర్యుద్ధానికి బంగారు పరిశ్రమ (Gold Industry) అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా మారింది. ఇరు ప‌క్షాల యుద్ధ ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌ధానంగా బంగారు ప‌రిశ్ర‌మ నుంచే నిధులు అందుతున్నాయి. ప్రధాన బంగారు గనుల్లో ఎక్కువ భాగం RSF అధినేత మహ్మద్ హమ్దాన్, అత‌ని కుటుంబ నియంత్ర‌ణ‌లో ఉన్నాయి. ముఖ్యంగా దార్ఫూర్ ప్రాంతంలోని గ‌నుల నుంచి వ‌చ్చే ఆదాయం ద్వారానే ఆర్ఎస్ఎఫ్ అత్యాధునిక ఆయుధాల‌ను కొనుగోలు చేస్తోంది. అంతేకాదు సైనికుల‌కు జీతాల‌ను కూడా చెల్లిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌మాదం జ‌రిగిన గ‌ని కూడా RSF ఆధీనంలోనే ఉంది. ఇక సైనిక సంఘర్షణల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు, ప్రభుత్వ రంగాలు మూత‌ప‌డ్డాయి. లక్షలాది మంది ప్రజలు రాత్రికి రాత్రే నిరుద్యోగులుగా మారారు. వేరే మార్గం లేక చాలామంది ప్రజలు పొట్ట‌కూటి కోసం ప్రాణాలకు తెగించి అక్రమ, ప్రమాదకరమైన బంగారు గనుల్లో పని చేస్తూ బ‌తుకీడుస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ జ‌రిగిన ప్ర‌మాదాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయి స‌జీవ స‌మాధి అవుతున్నారు.

Also Read..

ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు

ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీల‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన కేంద్రం

ఫ్యాక్ట్ చెక్‌.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్‌.. కేంద్రం క్లారిటీ..

Advertisement
Advertisement