త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్ర‌భుత్వ పిటిష‌న్ కొట్టివేత‌

Supreme Court | కోర్టుల్లో హైడ్రాకు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టుల్లో కూడా గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

S

Telangana | Published On Sep 15, 2026, 4.04 pm IST

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్ర‌భుత్వ పిటిష‌న్ కొట్టివేత‌
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్‌: కోర్టుల్లో హైడ్రాకు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టుల్లో కూడా గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కంటోన్మెంట్ ప‌రిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థిస్తూ జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఈ వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్‌ స్ట్రక్షన్‌దేనని గతంలో హైకోర్టు కూడా తీర్పు వెల్ల‌డించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును ఉల్లంఘించి శాంత శ్రీరామ్ కన్‌ స్ట్రక్షన్‌ సంస్థ భూమిలో హైడ్రా కూల్చివేతలకు కూడా పాల్పడింది.

దీంతోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ద్వారా స్టే పొందిన విష‌యం విదిత‌మే.

Advertisement
Advertisement